షాలిని ఇది నీకు తగునా.. అంటూ తలలు పట్టుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు..

రీసెంట్‌గా తమిళం, తెలుగులో కొన్ని ప్రాజెక్ట్‌లకు షాలినీ ఓకే చెప్పింది. వాటన్నంటికి డేట్లను కూడా అడజ్ట్ చేసిందని, అంతా ఓకే అయ్యాక తమకు హ్యాండ్ ఇచ్చిందని సదరు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు కారణం బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ రావడంతో ఈ ప్రాజెక్టులకు దూరంగా వుంటోందంటూ వార్తలు వినిపిస్తన్నాయి

news18-telugu
Updated: October 17, 2019, 12:25 PM IST
షాలిని ఇది నీకు తగునా.. అంటూ తలలు పట్టుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు..
Instagram.com/shalzp
  • Share this:
సినిమా రంగంలో ప్రతి ఏడాది కొత్త కథానాయికలు వస్తూనే వుంటారు. కొందరు తమ ప్రతిభతో ఆకట్టుకుంటే, మరికొందరు గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. లేలేత ముద్దుగుమ్మలు తమదై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొందరికే సాధ్యమవుతాయి. ఇక మొదటి సినిమాతో క్లిక్ అయితే.. హీరోయిన్‌గా బ్రాండ్ పడ్డట్టే. ఒక్క హిట్ కొట్టినా చాలు.. మరెన్నో అవకాశాలు ఈజీగా అందుకోవచ్చు అనే ఆలోచనతో వస్తున్నారు కొత్త కథానాయికలు.అయితే హిట్ కొట్టాక .. హడావిడిగా సినిమాలను ఓకే చేసేసి.. చేతులు కాల్చుకునే టైపు కొందరైతే.. ఆచితూచి ఆలోచిస్తూ సినిమాలు లైన్లో పెడతారు మరికొందరు. ఇదేవిధంగా 'అర్జున్ రెడ్డి' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే. `అర్జున్ రెడ్డి`లో లిప్‌లాక్స్ చేయ‌డానికి ఏమాత్రం ఈ అమ్మ‌డు వెనుకాడ‌లేదు. ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత ఒక్క‌సారిగా ఈ అమ్మ‌డు పేరు పాపుల‌ర్ అయింది.ఈ చిత్రంతో విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో.. ప్రీతిగా నటించిన షాలినీ పాండేకు అంతే పేరు వచ్చింది.అయితే ఎందుక‌నో షాలినికి అవ‌కాశాలు మాత్రం ప‌రిమితంగానే వ‌చ్చాయి.అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షాలినీ పాండే.. అంత త్వరగా ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ చాలా సెలెక్ట్‌డ్‌గా మూవీలను చేస్తూ వస్తోంది. కళ్యాణ్ రామ్‌తో `118` సినిమా.. అంతకు ముందు `య‌న్‌.టి.ఆర్` బ‌యోపిక్‌లో షావుకారు జానకి పాత్రలో కాసేపు కనిపించింది. ఐతే రీసెంట్‌గా తమిళం, తెలుగులో కొన్ని ప్రాజెక్ట్‌లకు షాలినీ ఓకే చెప్పింది. వాటన్నంటికి డేట్లను కూడా అడజ్ట్ చేసిందని, అంతా ఓకే అయ్యాక తమకు హ్యాండ్ ఇచ్చిందని సదరు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారట.  కారణం బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ రావడంతో ఈ ప్రాజెక్టులకు దూరంగా వుంటోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ విషయంలో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. షాలిని కారణంగా షూటింగ్స్ ఆల‌స్య‌మ‌వుతున్నాయని వాపోతున్నారు సదరు నిర్మాతలు. అమ్మ‌డు ప్ర‌వ‌ర్త‌న చూసిన కొంద‌రు మాత్రం ఈమెకు హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌పై షాలిని చిన్న‌చూపు చూడ‌టం స‌రికాద‌ని అంటున్నారు. అయితే షాలిని తన ప్రవర్తనను మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 17, 2019, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading