మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సందీప్ రెడ్డి వంగా..

అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు.తాజాగా సందీప్ రెడ్డి మరో క్రేజీ సినిమాకు ఓకే చెప్పాడు.

news18-telugu
Updated: October 10, 2019, 11:18 AM IST
మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సందీప్ రెడ్డి వంగా..
సందీప్ రెడ్డి వంగ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 10, 2019, 11:18 AM IST
అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన కోసం తెలుగు హీరోలు బాగానే వేచి చూస్తున్నారు. ఏదేమైనా కూడా 2017 నుంచి కూడా ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతోనే  ప్రయాణం చేస్తూనే ఉన్నాడు.  తెలుగులో రెండో సినిమా చేస్తాడేమో అనుకుంటే.. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ అయిపోయింది. తాజాగా సందీప్ రెడ్డి హిందీలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమాను నిర్మించిన టీ సిరీస్ భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని ఈ సినిమాను నిర్మించాడు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.

క్రైమ్ డ్రామ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించే అవకాశం ఉంది. ఈ సినిమా రణ్‌బీర్  కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...