అదిరిపోయే కాన్సెప్ట్‌తో వస్తోన్న సందీప్ వంగా..

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

news18-telugu
Updated: December 17, 2019, 11:01 PM IST
అదిరిపోయే కాన్సెప్ట్‌తో వస్తోన్న సందీప్ వంగా..
Twitter
  • Share this:
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేసి అక్కడ భారీ బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ డైరెక్టర్‌గా మారాడు. దీంతో అక్కడి నిర్మాతలు సందీప్‌తో సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగా ‘కబీర్ సింగ్’ చిత్ర నిర్మాత టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్‌ దర్శకత్వంతో భారీ స్థాయిలో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ కూడా భాగమవుతున్నాడు. ఈ సందర్బంగా ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక పాన్ ఇండియా సినిమా అని, క్రైమ్ డ్రామాగా రాబోతోందని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ.. సందీప్ సినిమాలు మిగితా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయని తెలుపుతూ.., ఆయనతో మరిన్ని సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని పేర్కోన్నారు.
తమన్నా నడుమందాలు అదరహో..
Published by: Suresh Rachamalla
First published: December 17, 2019, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading