HOME »NEWS »MOVIE »arjun reddy director sandeep reddy planning a movie with jr ntr

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా
Sandeep Reddy and NTR

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆయన టేకింగ్..మాటలు..పాటలు..అన్ని అదిరిపోయాయి. అయితే తాజాగా సందీప్ రెడ్డి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆయన టేకింగ్..మాటలు..పాటలు..అన్ని అదిరిపోయాయి. దీంతో సందీప్ రెడ్డికి మంచి పేరుతో పాటు..సూపర్ స్టార్‌ మహేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కడానికి అనుకున్నదాని కన్నఎక్కువ సమయం పడుతుండడంతో సందీప్ రెడ్డి..అర్జున్ రెడ్డిని హిందిలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.

    హిందిలో అర్జన్ రెడ్డిని కబీర్ సింగ్‌ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సందీప్ క్రేజీ కథతో ఓ సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలోస్తున్నాయి. ఈ సినిమాలో ప్రేమను కథాంశంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే సందీప్ సినిమా, రాజమౌళి సినిమా తర్వాత పట్టాలేక్కే చాన్సుంది. ఒకవేళ కనుక సందీప్‌తో ఎన్టీఆర్ సినిమా ఓకే అయితే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఎన్టీఆర్  అభిమానులు ఊహించుకుంటున్నారు.



    క్యూట్ అండ్ బ్యూటీఫుల్ హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోస్
    Published by:Suresh Rachamalla
    First published:January 04, 2019, 03:11 IST

    टॉप स्टोरीज