తెలుగులో విజయ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా.. అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే బాలీవుడ్లో రీమేక్ చేసి తెలుగులో మాదిరే అక్కడ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ విడుదలైన తర్వాత ఈ సినిమా బాగాలేదంటూ అక్కడి క్రిటిక్స్ కొంత మంది ఈ సినిమాను ఏకి పారేసారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను మాత్రం హిట్ చేసారు. విమర్శకుల ప్రశంసలకు భిన్నంగా ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది. ఐతే క్రిటిక్స్ ‘కబీర్ సింగ్’ సినిమాను విమర్శించిన తీరు గురించి ఇప్పటి వరకు సైలెంట్ మెయింటెన్ చేసిన సందీప్.. ఇపుడు కాస్తంత ఘాటుగానే స్పందించాడు.

విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్
ముఖ్యంగా ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ తెలివైన ప్రేక్షకులు ఈ సినిమాకు మాత్రం రూ.200 కోట్లు కట్టబెట్టారని చెప్పుకొచ్చాడు. తెలుగులో కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలైన తర్వాత ఇదే రీతిలో స్పందించారు. సినిమా టేకింగ్, టెక్నికల్ స్టాండర్ట్స్ గురించి ప్రస్తావించారు. కానీ ‘కబీర్ సింగ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకు సంబంధించిన సౌండ్, కెమెరా వర్క్ గురించి ఎవరు మాట్లాడలేదన్నారు. సినిమాకు సంబంధించి అ,ఆలు తెలియని వాళ్లు కూడా క్రిటిక్స్ అవతారం ఎత్తడం ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 07, 2019, 13:24 IST