news18-telugu
Updated: December 12, 2019, 6:24 PM IST
Twitter
శాలినీ పాండే.. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండకు ఏమాత్రం తగ్గకుండా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డితో వచ్చిన క్రేజ్‌తో.. తెలుగులో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి పూర్తి నిడివి పాత్రలు కాకుండా.. కేవలం అతిథి పాత్రలు కావడంతో రావాల్సిన గుర్తింపు రాలేదు. కాగా తమిళ్లో మాత్రం నాగచైతన్య '100 పర్సెంట్ లవ్' రీమేక్‌లో జీవా 'గోరిల్లా'లో శాలినీ పాండే నటించింది. అది అలా ఉంటే అమ్మడుకు మతిపోయే ఆఫర్ వచ్చింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ రణ్ వీర్ సింగ్‌తో 'జయేశ్‌భాయ్ జోర్దార్' అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో రణ్ వీర్‌కు జంటగా మొదటగా సారా అలీఖాన్, అనన్యా పాండే వంటి స్టార్ కిడ్స్ పేర్లు వినిపించినా చివరకు వాళ్లందరిని కాదని శాలినీని ఎంపిక చేశారు. ఈ సినిమాను దివ్యాంగ్ తక్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా శాలినీ పాండే మాట్లాడుతూ.. రణ్వీర్ లాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అంటోంది. శాలినీ ప్రస్తుతం తెలుగులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న.. ‘నిశబ్దం’లో నటిస్తోంది.
చలికాలంలో అనసూయ సెగలు...
Published by:
Suresh Rachamalla
First published:
December 12, 2019, 6:23 PM IST