బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి భామ.. రణ్‌వీర్ సింగ్‌తో.. మూడు సినిమాలు

Shalini Pandey : శాలినీ పాండే.. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండకు ఏమాత్రం తగ్గకుండా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు.

news18-telugu
Updated: September 2, 2019, 10:19 AM IST
బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి భామ.. రణ్‌వీర్ సింగ్‌తో.. మూడు సినిమాలు
Instagram/shalzp
news18-telugu
Updated: September 2, 2019, 10:19 AM IST
Shalini Pandey : శాలినీ పాండే.. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండకు ఏమాత్రం తగ్గకుండా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డితో వచ్చిన క్రేజ్‌తో.. తెలుగులో ‘మహానటి’, ‘118’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి పూర్తి నిడివి పాత్రలు కాకుండా.. కేవలం అతిథి పాత్రలు కావడంతో రావాల్సిన గుర్తింపు రాలేదు. కాగా తమిళ్‌లో మాత్రం నాగచైతన్య  '100 పర్సెంట్ లవ్' రీమేక్‌లో.. జీవా 'గోరిల్లా'.. శాలినీ పాండేకు నటించే అవకాశం వచ్చింది. అది అలా ఉంటే అమ్మడుకు మతిపోయే ఆఫర్ బాలీవుడ్ నుండి వచ్చిందట. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేయాలనీ ఆ ఆఫర్. అంతేకాదు బాలీవుడ్ క్రేజీ స్టార్  రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ఆమెకు అవకాశం వచ్చిందని టాక్. దీంతో శాలినీ  ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. 
Loading...

View this post on Instagram
 

Its a ‘miracle script’!!! 😍 Thrilled to announce my next film - ‘JAYESHBHAI JORDAAR’ 🎥 @yrf #JayeshbhaiJordaar


A post shared by Ranveer Singh (@ranveersingh) on

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌  రణ్ వీర్ సింగ్‌తో 'జయేశ్‌భాయ్ జోర్దార్' అనే సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రణ్‌ వీర్‌కు జంటగా మొదటగా సారా అలీఖాన్‌, అనన్యా పాండే వంటి స్టార్‌ కిడ్స్‌ పేర్లు వినిపించినా... చివరకు వాళ్లందరిని కాదని శాలినీని ఎంపిక చేశారట.. చిత్ర దర్శక నిర్మాతలు. దానికి సంబందించిన ఓ అగ్రిమెంట్‌‌పై శాలినీ సంతకం కూడా చేసిందని సమాచారం. ఆ అగ్రిమెంట్ ప్రకారం.. శాలినీ  యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు చేయాలట.  శాలినీ ప్రస్తుతం తెలుగులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న.. ‘నిశబ్దం’లో నటిస్తోంది. 
View this post on Instagram
 

I put a spell on you🖤 @khushboodixit_photos @daineshkumar


A post shared by Shalini (@shalzp) on
First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...