ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చేయడం చూస్తున్నాం. తాము తల్లి కాబోతున్నాం అని చెబుతూ ఇప్పటికే ఎందరో సెలబ్రిటీ తమ తమ బేబీ బంప్ ఫొటోస్ పంచుకున్నారు. అయితే తాజాగా బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్య పర్చింది బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ (Arjun Kapoor) కోడలు అంటారా మోతివాలా మార్వా (Antara Motiwala Marwah). ఫ్యాషన్ ట్రెండ్ లో భాగంగా ఇలా బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ చేసిన ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ లో సందడి చేసింది అర్జున్ కపూర్ కోడలు అంటరా మోతివాలా మార్వా. అయితే ఆమె ఏకంగా బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ కి రావడం అంతా షాకయ్యారు. బేబీ బంప్‌తో ఆమె చేసిన ర్యాంప్ వాక్ ఈ ఫ్యాషన్ వీక్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇది చూసి పలువురు సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.
ఫ్యాషన్ ట్రెండ్ లో తన బేబీ బంప్ చూపించడానికి ఏ మాత్రం సిగ్గు పడకుండా.. ఆమె ర్యాంప్ వాక్ చేయడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ర్యాంప్ వాక్ తో ఆమె ఆత్మవిశ్వాసం బయట పడటమే గాక ఎందరికో స్ఫూర్తినిచ్చింది. దీనిపై అర్జున్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరా (Malaika Arora) తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫైరింగ్ ఎమోజీలతో ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
అర్జున్ కపూర్ కజిన్ మోహిత్ మార్వాను 2018 ఫిబ్రవరిలో వివాహాం చేసుకుంది అంటారా. ఈ పెళ్లికి అర్జున్ కపూర్‌తో పాటు బోనీ కపూర్, శ్రీదేవి, ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే మోహిత్ మార్వా- అంటారా దంపతులకు ఓ ఆడ శిశువు జన్మించగా.. ఇప్పుడు తమ రెండవ బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood beauty, Malaika Arora