Home /News /movies /

ARJUN KAPOOR GIRLFRIEND MALAIKA ARORA ALSO TESTED CORONA POSITIVE PK

Malaika Arora: మలైకా అరోరాకు కరోనా పాజిటివ్.. అర్జున్ కపూర్‌కు వచ్చిన 24 గంటల్లోనే..

మలైకా అరోరా(malaika arora/Instagram)

మలైకా అరోరా(malaika arora/Instagram)

Malaika Arora: బాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల లిస్ట్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న కుర్ర హీరో అర్జున్ కపూర్ తనకు కరోనా సోకిందని..

బాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల లిస్ట్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న కుర్ర హీరో అర్జున్ కపూర్ తనకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరాడు. ఈ క్రమంలోనే అతడి ప్రేయసి మలైకా అరోరా కూడా ఇప్పుడు కరోనా బారిన పడింది. ఇదే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. అర్జున్ కపూర్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు.
మలైకా అరోరా(malaika arora/Instagram)
మలైకా అరోరా(malaika arora/Instagram)

అతడిని కలిసే ఉంటుంది కాబట్టి మలైకా అరోరాకు కూడా ఇప్పుడు కరోనా సోకిందంటున్నారు విశ్లేషకులు. ఈమె కూడా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం తనకు బాగానే ఉంది.. చాలా తక్కువ లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది మలైకా. ఇప్పటికే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, అభిషేక్, అనుపమ్ ఖేర్ కుటుంబం, ఐశ్వర్యారాయ్ లాంటి వాళ్లకు కరోనా వచ్చింది.. తగ్గిపోయింది. ఇప్పుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు గెట్ వెల్ సూన్ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema, Malaika Arora

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు