అప్పుడు మీరు శ్రీదేవిని దూషించారు.. ఇపుడు మీరు చేస్తున్నదేమిటి ? అర్జున్ కపూర్‌కు నెటిజన్ సూటి ప్రశ్న..

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రముఖ నటి మలైక అరోరాతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఆ పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. ఐతే వీళ్ల బంధంపై కుసుమ్ అనే యువతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.దానిక అర్జున్ కపూర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

news18-telugu
Updated: May 29, 2019, 3:23 PM IST
అప్పుడు మీరు శ్రీదేవిని దూషించారు.. ఇపుడు మీరు చేస్తున్నదేమిటి ? అర్జున్ కపూర్‌కు నెటిజన్ సూటి ప్రశ్న..
శ్రీదేవి,అర్జున్ కపూర్,మలైక అరోరా
news18-telugu
Updated: May 29, 2019, 3:23 PM IST
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రముఖ నటి మలైక అరోరాతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఆ పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. ఐతే వీళ్ల బంధంపై కుసుమ్ అనే యువతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.మీ నాన్న మీ అమ్మను ఒదిలేసి శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడంతో మీరు ఆమెను ద్వేషించారు. మరి మీరు మీ ఏజ్‌లో 11 ఏళ్లు పెద్దదైన మహిళతో ఎలా డేటింగ్ చేస్తున్నారంటూ సదరు నెటిజన్ ప్రశ్నించింది. పైగా ఆమెకు ఓ టీనేజ్ బాయ్ కూడా ఉన్నాడు. మీ తండ్రికి ఒక రూల్ ? మీకొక రూలా ? అని కామెంట్ చేశారు.దీనిపై అర్జున్ సదరు నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. నాకు ఎవరిపై ద్వేషభావం లేదు. కాకపోతే..నా తండ్రి రెండో కుటుంబానికి కాస్త దూరంగా ఉండేవాడిని. మీరన్నట్టు నేను శ్రీదేవిని అసహ్యించుకుంటే ఆమె కుమార్తైలన జాన్వి, ఖుషీలను నా చెల్లెల్లుగా స్వీకరించేవాడిని కాదు కదా అని సమాధానమిచ్చాడు.

మీ లాంటి వాళ్లు కామెంట్ చేయడం చాలా ఈజీ. కానీ అలా మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. అదీ కాకుండా మీరు హీరో వరుణ్ ధావన్ ఫ్యాన్ అని మీ అకౌంట్ చూస్తే తెలుస్తోంది. కాబట్టి ఆయన పేరు వాడుకుంటూ ఇలా తప్పుడు ప్రచారం చేయకండి అని చెప్పారు.దాంతో సదరు కుసుమ్ వెంటనే అర్జున్‌కు ట్విట్టర్ వేదికగా సారీ చెప్పింది.ఈ ట్వీట్ ఆయన వరుణ్ దృష్టికి రావడంతో ఆయన కూడ ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. మీరు అర్జున్‌కు క్షమాపణలు చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కుసుమ్. అర్జున్‌ది గొప్ప మనసు. నా ఫ్యాన్స్ ఇతర నటీనటులను చులకనగా చూడకూడదని కోరకుంటున్నాను అని ట్వీట్ చేసాడు.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...