Arjun Kapoor : బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఇంట్లో కరోనా కలకలం.. చెల్లెలు సహా అందరికీ కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాదు అర్జున్ కజిన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రియా కపూర్ ఆమె భర్త కరన్ భూలాని కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీళ్లందరు రీసెంట్‌గా జరిగిన అర్జున్ కపూర్ చెల్లెలు.. బోనీ కపూర్ పెద్ద కూతురు అన్షులా కపూర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీళ్లందరు కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వేడుకల్లో పాల్గొన్న అర్జున్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరాకు మాత్రం కోవిడ్ నెగిటివ్‌గా తేలింది. రీసెంట్‌గా వీళ్లిద్దరు ముంబైలో కలిసి షికార్లు చేశారు. అంతేకాదు వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. బయటకు ఎక్కడికి వెళ్లినా.. ఒకే కారులో వెళుతున్నారు. అయినా.. మలైకాకు కరోనా నెగిటివ్‌గా రావడం హాట్ టాపిక్‌గా మారింది.
2020 సెప్టెంబర్‌లో అర్జున్ కపూర్, మలైకా అరోరా కరోనా బారిన పడ్డన సంగతి తెలిసిందే కదా. గతంలో తనకు కరోనా సోకడంతో అర్జున్ కపూర్ తానెంతో భయానికి లోనైనట్టు చెప్పారు. కరోనా వల్ల తనకే కాకుండా.. మొత్తం కుటుంబం కూడా ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి. అందుకే బయటకు వెళ్లినపుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలనే నియమం పెట్టుకున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం అర్జున్ కపూర్ సహా వీళ్లందరు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్ల సూచనలతో ఇంట్లోనే ఐసోలేషన్ రూమ్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రీసెంట్‌గా అర్జున్ కపూర్ బాబాయి సంజయ్ కపూర్.. భార్య కూడా కరోనా పడిందట. వాళ్ల నుంచే వీళ్లకు సోకి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో విరుచుకుపడింది. నిన్న మొన్నటి వరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇపుడు వేలల్లోకి చేరుకుంది. దీనికి పేదా, గొప్ప, పెద్దా, చిన్న, ఆడా, మగ, సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఎవరినీ విడిచిపెట్టడం లేదు.
గతంలో ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో కొంత మంది కేంద్ర మంత్రులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు కరోనా కారణంగా మనకు దూరమయ్యారు. అటు తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే.. మంచు మనోజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తమిళంలో కమల్ హాసన్, విక్రమ్, వడివేలు సహా చాలా మంది ఈ మధ్య కోవిడ్ బారిన పడ్డారు. అలాగే బాలీవుడ్‌లో కూడా కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిన చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఓమైక్రాన్ దేశంలో మెల్లమెల్లగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కొత్త యేడాది సందర్భంగా ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు ఇప్పటికే సూచిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.