అరియానా బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 లో ఓ సంచలనం అనే చెప్పాలి. ఈమె ఆడే ఆటతీరును చూస్తుంటే రెండో సీజన్లో ఆడిన కౌషల్ గుర్తొస్తోందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఆమె మాట్లాడే తీరు, నడవడిక, అలాగే ఆమె మొహమాటం లేకుండా టాస్కుల్లో దూసుకెళ్లే తత్వం చూసి ఆమెను సెకండ్ సీజన్ విన్నర్ కౌషల్ తో పోల్చుతున్నారు. కౌశల్ కూడా ఇలాగే గేమ్ ప్లాన్ చేశాడు. ఖరాఖండీగా ఉంటూ టాస్కు విషయంలో చాలా ఓపెన్ గా ఉండేవాడు. అలాగే ఎలాంటి సెంటిమెంట్స్ కు తావు ఇవ్వకుండా కౌషల్ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. హౌస్ మొత్తం ఒక ఎత్తయితే, కౌశల్ మాత్రం ఒక ఎత్తుగా ఉండేవాడు. అయితే ఇఫ్పుడు సరిగ్గా అలాంటి గేమ్ స్ట్రాటజీనే అరియానా ప్లే చేస్తోంది. నిజానికి అరియానా ఆటతీరు చాలా మందికి నచ్చడం లేదు. కానీ అలాగే ఆడాలని వాదించే వారు చాలా మంది ఉన్నారు. నిజానికి బిగ్ బాస్ ను రెగ్యులర్ వాచ్ చేస్తూ ఇష్ట పడేవారికి అరియానాలా లాంటి వారి ఆటతీరే నచ్చుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి. ఎలా టాస్క్ ఆడాలో అలాగే ఆడుతూ, ఎవరేమన్నా పట్టించుకోకుండా అరియానా దూసుకెళ్తోంది. అటు హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యే వారు సైతం అరియానాను చాలా క్రిస్టల్ క్లియర్ అని పొగుడుతున్నారు. ఆమెకు ఎలాంటి కల్మషం లేదని చెప్పుకొస్తున్నారు.

Instagram
మరోవైపు సెకండ్ సీజన్ లో దుమ్ము దులిపిన్ కౌషల్ స్ట్రాటజీతోనే అరియానా ఆడుతోందని, బిగ్ బాస్ ను రెగ్యులర్ గా విశ్లేషించే వారు వాదిస్తున్నారు. అయితే కౌషల్ ప్రస్తుతం అరియానా కన్నా బాగా స్ట్రాంగ్ గా ఉండేవాడని కౌషల్ ఆర్మీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ వాదన వినిపిస్తున్నారు. నిజానికి హౌస్ లో కౌషల్ తనకు తానుగా ఇండివిడ్యువల్ గా ఉండేవాడు. అతడికి ఏ ఒక్కరూ మద్దతుగా నిలిచేవారు కాదు. కానీ ఆ సింపతీయే ప్రేక్షకుల్లో వర్కౌట్ అయ్యంది.
బిగ్ బాస్ లో కౌశల్ ఆటతీరే ఒక బజ్ గా మారింది. అయితే కౌశల్ తో పోల్చితే అరియానాకు కొంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే గేమ్ ఆడటంలో మాత్రం అరియానా కౌశల్ ను గుర్తు చేస్తోంది. ఇటీవల అరియానా టాస్క్ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. “నేను గేమ్ ఆడటానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ కు వచ్చాను. బిగ్ బాస్ ఇఛ్చిన టాస్క్ ను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు. నేను వచ్చింది అందుకే” అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తోంది.
మిగిలిన హౌస్ మేట్స్ మాత్రం మానవత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అక్కడక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే సీజన్ టూలో గేమ్ కోసమే ఇక్కడకు వచ్చానంటూ ఖరకండీగా మాట్లాడిన కౌశల్ చివరకు విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు అరియానా కూడా అదే స్ట్రాటజీ అవలంబిస్తోంది. మరీ ఈ సారి వర్కౌట్ అవుతుందా కాదా అనే ముందు ముందు తేలాల్సి ఉంది.
Published by:Krishna Adithya
First published:November 11, 2020, 23:04 IST