Home /News /movies /

ARIYANA REACHES TOP PLACE IN BIGG BOSS 4 VOTING MNJ

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్.. అనూహ్యంగా ఓటింగ్‌లో పుంజుకున్న ఆ కంటెస్టెంట్

బిగ్‌బాస్ 4

బిగ్‌బాస్ 4

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4(Bigg Boss 4) మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? అని అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

  తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? అని అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరేమో తమ కంటెస్టెంటే విన్నర్ అని.. ఇంకొందరమో కాదు కాదు మా హీరోనే విన్నర్ అని.. మరికొందరేమో అబ్బే మా వాడే హీరో అని సోషల్ మీడియాలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీనంతటికి కారణం ఆ ఓటింగే.. ఒక్కోసారి ఒక్కోలా చూపించడంతో ఆయా కంటెస్టెంట్‌ను అభిమానిస్తున్న వారిలో కొత్త ఊపు వస్తోంది. అయితే ఒకసారి ఓటింగ్‌లో ఎక్కడో ఉన్న కంటెస్టెంట్ అనూహ్యంగా పుంజుకుంటే లెక్కలే తారుమారవుతాయ్.. ఇప్పుడు హౌస్‌లో ఇదే పరిస్థితి ఉంది. ఇంతకీ ఒక్కసారిగా పుంజుకున్న కంటెస్టెంట్ ఎవరు..? డౌన్ అయిన కంటెస్టెంట్ ఎవరు..? ఫైనల్‌గా విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు చూద్దాం.

  సీన్ రివర్స్..!
  షో మొదలైనప్పట్నుంచి ఫర్లేదు అనిపించుకుంటూ వస్తున్న అభిజిత్ చివరికి విన్నర్‌గా నిలుస్తాడని వీక్షకులు, నెటిజన్లు చెబుతూనే ఉన్నారు. ఇందుకు ఓటింగ్ కూడా ప్రత్యక్ష సాక్ష్యమే. ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో అభికి గట్టిగానే ఓట్లు పడటంతో ముందు వరుసలో ఉన్నాడు. ఇది చాలా వరకు అఫిషియల్ పోల్ అయినా.. అనఫిషియల్ పోల్ అయినా నడుస్తూ వస్తున్న సీనే. అంతేకాదు.. అభిజిత్ విన్నర్ కాబోతున్నాడు.. ఇప్పటికే అంతా అయిపోయింది.. లాస్ట్ రోజు అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలుందని అభిమానులు నెట్టింట్లో కోడై కూస్తున్నారు. అయిత్ ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే అభి ఒక్కసారిగా సెకండ్‌కు రాగా.. సెకండ్, థర్డ్ ప్లేస్‌లో ఉంటూ వస్తున్న అరియానా అనూహ్యంగా పుంజుకుని ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. దీంతో అభి అభిమానుల్లో ఇప్పటి వరకూ ఉన్న ఉత్సాహం మొత్తం పోయినట్లుయ్యింది.

  అనూహ్యంగా..?
  ఓటింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందనేది అందరికి తెలిసిందే. ఒక్కోసారి ఒక్కోలా ఉండి.. లేని పోని టెన్షన్ పెడుతుంటుంది. ఇప్పుడు అదే టెన్షన్ అటు అభిలో.. ఇటు ఆయన అభిమానుల్లో మొదలైంది. వాస్తవానికి ఇప్పటి వరకూ ఏ పోల్ చూసినా 50 శాతానికి పైగానే అభికి ఓట్లు పడుతూనే వచ్చాయి. దీంతో అభి ఫస్ట్ ప్లేస్‌కు.. సెకండ్ సోహైల్.. థర్డ్ అరియానా ఉండేవారు. సెకండ్, థర్డ్ కంటెస్టెంట్ల స్థానాలు ఒక్కోసారి మారేవి కానీ.. ఇంతవరకూ అభి స్థానం మాత్రం పదిలంగా ఉండేది. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ పోలింగ్‌‌ ప్రకారం చూస్తుంటే థర్డ్ ప్లేస్‌లో ఉండే అరియానా ఒక్కసారిగా ఫస్ట్ ప్లేస్‌ కొట్టేయడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఇది ఎలా సాధ్యమైందబ్బా అంటూ అభి అభిమానులు, వీక్షకులు, నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు, అభి అభిమానులు చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో ఈ పోల్ మొత్తం అచ్చుతప్పు అని చెప్పుకుంటూ ఉండగా.. ఇదంతా ట్రాప్ అని ఎవరూ నమ్మకండని విన్నర్ అభినే అని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే నాలుగు రోజుల్లో షో ముగుస్తుందనగా అభిజిత్ ఫ్యాన్స్ ఓట్లు మరిన్ని దక్కించుకునేందుకుగాను ఇలా గాసిప్స్, ఫేక్ పోల్స్ పుట్టిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  ఏం జరుగునో..!?
  వాస్తవానికి అభిజిత్‌కు విన్నర్ అయ్యే అవకాశాలున్నాయి. అభికి మిస్సయితే సోహైల్ విన్నర్ అవుతారు. ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా కాస్త అటు ఇటో అరియానా రన్నర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పోలింగ్‌పై రకరకాలు అభిప్రాయాలు, అనుమానాలు వస్తున్నాయి. బహుశా ఈ పోలింగ్ గురించి తెలిస్తే కంటెస్టెంట్లే షాక్‌కు గురవుతారేమో. ఫైనల్‌గా.. సీన్ ఇలానే ఉంటుందో ఓటింగ్ మారిపోయినట్లు సడన్‌గా సీన్ మారి రివర్స్ అవుతుందో..? ముందే అనుకున్నట్లు అభినే విన్నర్‌గా నిలిచి ట్రోపి గెలుస్తాడో లేదా మరెవరైనా విన్నర్‌గా నిలుస్తారా..? అనేది తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు మరి.
  Published by:Manjula S
  First published:

  Tags: Bigg Boss 4 Telugu, Television News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు