• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ARIYANA GLORY SISTER NAYANI ABOUT BIGG BOSS 4 WINNER MNJ

Ariyana Glory: మా అక్క‌నే విన్న‌ర్‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ర‌న్న‌ర్‌.. అరియానా గ్లోరీ సోద‌రి జోస్యం

Ariyana Glory: మా అక్క‌నే విన్న‌ర్‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ర‌న్న‌ర్‌.. అరియానా గ్లోరీ సోద‌రి జోస్యం

అరియానా గ్లోరీ

తెలుగు బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4(Bigg Boss 4 Telugu) ఇవాళ్టితో ముగియ‌నుంది. నాగార్జున(Akkineni Nagarjuna) వ్యాఖ్య‌త‌గా 105 రోజుల పాటు సాగిన ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

  • Share this:
    Ariyana Glory sister: తెలుగు బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఇవాళ్టితో ముగియ‌నుంది. నాగార్జున వ్యాఖ్య‌త‌గా 105 రోజుల పాటు సాగిన ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. ఇక ప్ర‌స్తుతం అభిజీత్, హారిక‌, అఖిల్, సొహైల్, అరియానాలు టాప్ 5లో ఉండ‌గా.. వీరి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ స్టార్ట్ చేశారు. మా కంటెస్టెంట్ విన్న‌ర్ అంటే మా కంటెస్టెంట్ విన్న‌ర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక అభిజీత్‌నే ఈ సీజ‌న్ విన్న‌ర్ అని అన్ని పోల్స్ చెబుతున్నాయి. అయితే ఈసారి ఫీమెల్ విన్న‌ర్‌ని ప్ర‌క‌టించ‌నున్నార‌ని.. బిగ్‌బాస్ 4 టైటిల్ విన్న‌ర్ అరియానా అయ్యే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా ఎవ‌రు వ‌స్తార‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే ఈ సీజ‌న్ విన్న‌ర్ త‌న అక్క‌నే అంటోంది అరియానా గ్లోరీ సోద‌రి న‌య‌ని.

    ఈ మేర‌కు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. మా అక్క‌నే క‌చ్చితంగా విజేత‌గా నిలుస్తుంది. అభిజీత్ గానీ సొహైల్ గానీ ర‌న్న‌ర్‌గా అవ్వొచ్చు అంటూ న‌య‌ని జోస్యం చెప్పింది. ఇంత‌వ‌ర‌కు ఒక్క లేడి బిగ్‌బాస్ లేరు కాబ‌ట్టి ఈసారి అరియానాకు టైటిల్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని బ‌య‌ట టాక్ న‌డుస్తుండగా.. దానిపై స్పందించిన న‌య‌ని.. మా అక్క ఒక కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ విజేత‌గా నిల‌వాల‌నుకుంటా. విమెన్‌, మెన్ అన్న బేధం ఉండ‌దు.

    త‌ను విమెన్ కార్డు వాడాల‌నుకుంటే ఎప్పుడో వాడేది అని స‌మాధానం ఇచ్చింది. ఇక అరియానా టాప్ 5లో ఉంటుంద‌ని మీరు ముందే ఊహించారా అన్న ప్ర‌శ్న‌కు.. తాను బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లినప్పుడే మాకు ఆ న‌మ్మ‌కం ఉంది. అరియానా త‌న ప‌ర్ఫామెన్స్‌తో త‌న గ్రాఫ్‌ని పెంచుకుంటూ పోయింది. లోప‌లికి వెళ్లాక తాను చాలా మారిపోయింది. అవ‌స‌రంలో ఉన్న‌ప్పుడు తాను అవినాష్‌కి చాలా సాయం చేసింది. త‌ను అంత ప్రెజ‌ర్‌ని త‌ట్టుకుంటుంద‌ని అప్పుడే మాకు అర్థ‌మైంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు