ఏమీ లేదంటూనే ప్రేమలో పడ్డ రష్మీ గౌతమ్, సుధీర్..!

Jabardasth Comedy Show : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారా? ఈ ప్రశ్నకు వారిద్దరు ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ప్రేక్షకులు, అభిమానులు మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నారు.

news18-telugu
Updated: January 10, 2020, 2:46 PM IST
ఏమీ లేదంటూనే ప్రేమలో పడ్డ రష్మీ గౌతమ్, సుధీర్..!
రష్మీ, సుడిగాలి సుధీర్
  • Share this:
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారా? ఈ ప్రశ్నకు వారిద్దరు ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ప్రేక్షకులు, అభిమానులు మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నారు. బయటికి చెప్పడం లేదు గానీ.. వాళ్లు నిజంగానే ప్రేమలో ఉన్నారని అంటున్నారు. కెరీర్‌కు ప్రాబ్లం అవుతుందన్న భయంతో వాళ్లు ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారని వాదిస్తున్నారు. అంత గట్టిగా వారిద్దరు వాదించడానికి కారణం ఏంటంటే.. ఏ షో అయినా సరే వాళ్లిద్దరు ఉన్నారంటే వారిద్దరి రొమాన్స్‌కు సంబంధించిన ఒక్క సన్నివేశమైనా ఉంటుంది. అదేదో.. తెరపై రొమాన్స్ చేశామా? లేదా? అన్నట్లు ఉండదు. ప్రేమను పండిస్తారు. రొమాన్స్‌లో జీవిస్తారు. పెద్ద నటీనటులు సైతం ఇంత బాగా రొమాన్స్ పండించలేరు అన్నట్లుగా జీవిస్తారు వాళ్లు.

జబర్దస్త్ అయినా, ఢీ షో అయినా.. మరే షో అయినా సరే రొమాన్స్ అంటే ఇలాగే ఉంటుంది అన్నట్లు నటిస్తారు. తాజాగా.. ఢీ ఛాంపియన్స్‌ వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో రష్మీ, సుధీర్‌కు సంబంధించిన రొమాన్స్ సన్నివేశం, పాట ఉంటాయి. వాటిలో ఆ జంటను చూస్తుంటే వారిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని, కానీ అబద్ధం ఆడుతున్నారని అనిపిస్తుంది. ఇదే విషయాన్ని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు రష్మీ-సుధీర్ ఫ్యాన్స్.

కాగా, స్క్రిప్టు ప్రకారమే తాము అలా నటిస్తున్నామని, తమ మధ్య మంచి స్నేహం తప్ప.. ఇంకేమీ లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. నిజజీవితంలో తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నామని, ప్రేమ మాత్రం లేదని తేల్చి చెబుతున్నారు. మరి.. వాళ్లు చెప్పేది నిజమో కాదో తెలీదు కానీ.. తెరపై మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తున్నారు.

First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు