ఎన్టీఆర్ బాకీ ఎంత.. "అర‌వింద స‌మేత" కలెక్షన్ల మాటేంటి..?

ఆరంభం ఎప్పుడూ ముఖ్యం కాదు.. ముగింపే కీల‌కం. ఆట ఎలా మొద‌లుపెట్టినా కూడా చివ‌రికి గెలుపుతో ముగించిన‌పుడే అందం. ఇప్పుడు "అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌"ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 19, 2018, 4:15 PM IST
ఎన్టీఆర్ బాకీ ఎంత..
అరవింద సమేత
  • Share this:
ఆరంభం ఎప్పుడూ ముఖ్యం కాదు.. ముగింపే కీల‌కం. ఆట ఎలా మొద‌లుపెట్టినా కూడా చివ‌రికి గెలుపుతో ముగించిన‌పుడే అందం. ఇప్పుడు "అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌"ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ చిత్రం తొలిరోజు నుంచే రికార్డ్ వ‌సూళ్లు.. క‌లెక్ష‌న్ల ఊచ‌కోత‌.. ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం ముందు క‌నిపించ‌ని రికార్డుల ఆన‌వాళ్లు.. ఇలా సాగుతుంది వారం రోజులుగా "అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ" వ‌సూళ్ల వేట‌. తొలివారం 77 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి తెలుగు ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి.. రంగ‌స్థలం త‌ర్వాత స్థానంలో నిలిచింది ఈ చిత్రం.

aravinda sametha veera raghava1st week ww collections.. ఎన్టీఆర్ బాకీ ఎంత.. "అర‌వింద స‌మేత" కలెక్షన్ల మాటేంటి..? aravinda sametha first week ww collections,aravinda sametha,ntr,trivikram,pooja hegde,telugu cinema,jt ntr,jagapathi babu,sunil,nizam,overseas collections,అరవింద సమేత,సేఫ్ జోన్,93 కోట్లు,టార్గెట్,జూనియర్ ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,పూజాహెగ్డే.త్రివిక్రమ్,సునీల్,జగపతిబాబు,తెలుగు సినిమా,ఓవర్సీస్,కలెక్షన్స్,ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సేఫ్ జోన్
అర‌వింద స‌మేత‌


సౌత్ ఇండియాలో వ‌ర‌స‌గా మూడు సినిమాల‌తో 100 కోట్లు గ్రాస్.. 75 కోట్ల షేర్ అందుకున్న మూడో హీరో ఎన్టీఆర్. ఈయ‌న కంటే ముందు ర‌జినీకాంత్, విజ‌య్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు "అర‌వింద స‌మేత" 77 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల‌కు 58 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా సేఫ్‌జోన్‌కి రావాలంటే 70 కోట్లు రావాలి. అంటే మ‌రో 12 కోట్లు వెన‌క‌బ‌డి ఉంద‌న్న‌మాట‌. నైజాంలో 16.50 కోట్ల షేర్ తెచ్చింది ఈ చిత్రం. ఇక సీడెడ్‌‌లో వ‌ర‌సగా మూడోసారి 10 కోట్ల షేర్ మార్క్ అందుకున్నాడు ఎన్టీఆర్. సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి ఇప్ప‌టికీ వ‌సూళ్లు ప‌ర్లేద‌నే స్థాయిలో వ‌స్తున్నాయి. అయితే సినిమా సేఫ్ కావాలంటే మ‌రో 16 కోట్లు రావాలి.. మ‌రో రెండు రోజులు హాలీడేస్ ఉన్నాయి. ఈ వీకెండ్ అర‌వింద స‌మేత‌కు కీల‌కంగా మారింది.

aravinda sametha veera raghava1st week ww collections.. ఎన్టీఆర్ బాకీ ఎంత.. "అర‌వింద స‌మేత" కలెక్షన్ల మాటేంటి..? aravinda sametha first week ww collections,aravinda sametha,ntr,trivikram,pooja hegde,telugu cinema,jt ntr,jagapathi babu,sunil,nizam,overseas collections,అరవింద సమేత,సేఫ్ జోన్,93 కోట్లు,టార్గెట్,జూనియర్ ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,పూజాహెగ్డే.త్రివిక్రమ్,సునీల్,జగపతిబాబు,తెలుగు సినిమా,ఓవర్సీస్,కలెక్షన్స్,ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సేఫ్ జోన్
అర‌వింద స‌మేత‌




పైగా ఈ వారం "హ‌లో గురు ప్రేమ‌కోస‌మే"తో పాటు "పందెంకోడి 2" సినిమాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ త‌ట్టుకుని.. నిల‌బ‌డి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర "అర‌వింద స‌మేత" తెచ్చే ఒక్కో కోటి దాని స‌త్తాకు నిద‌ర్శ‌నం. అందుకే ఇప్ప‌ట్నుంచి వ‌చ్చే ప్ర‌తీ రూపాయి కౌంట్ అన్న‌మాట‌. 93 కోట్లు వ‌స్తే ఈ చిత్రం హిట్ లేదంటే యావ‌రేజ్. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే సినిమా సేఫ్ జోన్‌కు రావ‌డం దాదాపు అసాధ్యం అయిపోయింది. మొత్తానికి చూడాలిక‌.. ఫుల్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి "అర‌వింద స‌మేత" ఎంత దూరానికి వెళ్లి ఆగుతుందో..?
First published: October 19, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...