"అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వీరరాఘ‌వుడి ఊచకోత..

ఆక‌లితో ఉన్న సింహం పంజా విసిరితే ఎట్టుంటాడో తెలుసా..? ఒక్క ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు క‌సితో మ‌ళ్లీ బాక్సాఫీస్‌పై తెగ‌బ‌డితే ఎట్టుంటాదో తెలుసా..? వ‌ర‌స‌గా నాలుగు విజ‌యాలు అందుకున్న హీరో.. ఐదోసారి కూడా అరాచ‌కం చేస్తుంటే ఎట్టుంటాదో తెలుసా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 12:33 PM IST
అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 12:33 PM IST
ఆక‌లితో ఉన్న సింహం పంజా విసిరితే ఎట్టుంటాడో తెలుసా..? ఒక్క ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు క‌సితో మ‌ళ్లీ బాక్సాఫీస్‌పై తెగ‌బ‌డితే ఎట్టుంటాదో తెలుసా..? వ‌ర‌స‌గా నాలుగు విజ‌యాలు అందుకున్న హీరో.. ఐదోసారి కూడా అరాచ‌కం చేస్తుంటే ఎట్టుంటాదో తెలుసా..? ఇప్పుడు "అర‌వింద స‌మేత" క‌లెక్ష‌న్లు చూస్తుంటే అట్టున్నాది. సినిమా ఇక్క‌డా అక్క‌డా అనే తేడా లేకుండా కుమ్మేస్తుంది. తొలిరోజు వీర‌రాఘ‌వుడి దాటికి రికార్డుల షేపులు మారిపోతున్నాయి.

"అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వీరరాఘ‌వుడి ఊచకోత.. aravinda sametha veera raghava 1st day total ww collections..
అర‌వింద స‌మేత‌


తొలిరోజే నైజాంలో 5.73 కోట్ల షేర్ వ‌సూలు చేసింది "అర‌వింద స‌మేత‌". నాన్ "బాహుబ‌లి" రికార్డ్ ఇది. ఇదివ‌ర‌కు ఈ రికార్డ్ ఎన్టీఆర్ "జ‌న‌తా గ్యారేజ్" పేరు మీదుంది. ఆ సినిమా 5.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది.. ఇప్పుడు "అర‌వింద స‌మేత" మ‌రో 23 ల‌క్ష‌లు అద‌నంగానే తెచ్చింది. ఈ ఏడాది వ‌చ్చిన "అజ్ఞాత‌వాసి" తొలిరోజు 5.48 కోట్లు వ‌సూలు చేసింది. "బాహుబ‌లి" కాకుండా "అర‌వింద స‌మేత" ఇప్పుడు అన్ని రికార్డులను దాటేసింది.

"అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వీరరాఘ‌వుడి ఊచకోత.. aravinda sametha veera raghava 1st day total ww collections..
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్




కృష్ణాలో కూడా ఏకంగా తొలిరోజే 2 కోట్ల 20 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులోనూ రికార్డ్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్‌లో అయితే ఏకంగా తొలిరోజే 1 మిలియ‌న్ దాటి వీకెండ్ నాటికి 3 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

"అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వీరరాఘ‌వుడి ఊచకోత.. aravinda sametha veera raghava 1st day total ww collections..
అరవింద సమేత వీరరాఘవ మూవీలో స్లిల్


మొత్తంగా తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో "అజ్ఞాత‌వాసి" పేరు మీదున్న 26 కోట్ల షేర్ రికార్డ్ కొన్ని లక్షల తేడాతో మిస్ అయిపోయింది ఈ చిత్రం. ఓవ‌రాల్‌గా కూడా ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా 36.80 కోట్ల షేర్ అందుకుంది "అరవింద సమేత". మరివీకెండ్ నాటికి అర‌విందుడి ఉగ్రానికి ఎన్ని రికార్డులు బ‌లైపోయాయో తెలుస్తుంది.
First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...