ప్రివ్యూ: ‘అర‌వింద స‌మేత’ మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..!

"నా పేరు సూర్య" త‌ర్వాత స్టార్ హీరో సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. దాంతో ఇప్పుడు "అర‌వింద స‌మేత‌"పై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు ఆస‌క్తి రెండూ క‌నిపిస్తున్నాయి. పైగా "అజ్ఞాత‌వాసి" త‌ర్వాత త్రివిక్ర‌మ్ 9 నెల‌ల గ్యాప్‌లోనే మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా 2500 థియేట‌ర్స్‌లో "అర‌వింద స‌మేత" విడుద‌ల‌వుతుంది. ఓవ‌ర్సీస్‌లో అక్టోబ‌ర్ 10 రాత్రే ప్రీమియ‌ర్ షోస్ భారీగా ప‌డుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2018, 11:08 PM IST
ప్రివ్యూ: ‘అర‌వింద స‌మేత’ మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..!
అర‌వింద స‌మేత‌ వీర రాఘవలో ఎన్టీఆర్ జూనియర్
  • Share this:
"అర‌వింద స‌మేత‌".. ఇప్పుడు ఎక్క‌డ విన్నా.. చూసినా ఇదే సినిమా గురించి చ‌ర్చ‌. దాదాపు మూడు నెల‌లు దాటిపోయింది తెలుగులో స్టార్ హీరో సినిమా వ‌చ్చి. మ‌ధ్య‌లో "గీత‌గోవిందం" లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు వ‌చ్చాయి కానీ "నా పేరు సూర్య" త‌ర్వాత స్టార్ హీరో సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. దాంతో ఇప్పుడు "అర‌వింద స‌మేత‌"పై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు ఆస‌క్తి రెండూ క‌నిపిస్తున్నాయి. పైగా "అజ్ఞాత‌వాసి" త‌ర్వాత త్రివిక్ర‌మ్ 9 నెల‌ల గ్యాప్‌లోనే మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు.

ప్రివ్యూ: "అర‌వింద స‌మేత" మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..! aravinda sametha movie preview.. ntr targets day 1 records..
అర‌వింద స‌మేత‌


ప్ర‌పంచ వ్యాప్తంగా 2500 థియేట‌ర్స్‌లో "అర‌వింద స‌మేత" విడుద‌ల‌వుతుంది. ఓవ‌ర్సీస్‌లో అక్టోబ‌ర్ 10 రాత్రే ప్రీమియ‌ర్ షోస్ భారీగా ప‌డుతున్నాయి. కేవ‌లం ప్రీమియ‌ర్స్ నుంచే 1 మిలియ‌న్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంచ‌నాలు భారీగా ఉండ‌టం.. ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌లో ఉండ‌టంతో అర‌వింద స‌మేత అద్భుతాలు చేస్తుంద‌నేది ఫిక్సైపోయారంతా. పైగా తొలిరోజు ఈ చిత్రం క‌చ్చితంగా ఎన్టీఆర్ గ‌త రికార్డుల‌న్నింటినీ తుడిచేయ‌డ‌మే కాకుండా తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా టాప్ 3లో ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ప్రివ్యూ: "అర‌వింద స‌మేత" మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..! aravinda sametha movie preview.. ntr targets day 1 records..
అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఎన్టీఆర్


"బాహుబ‌లి 2" ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు "అజ్ఞాత‌వాసి" 40 కోట్ల షేర్‌తో తొలిరోజు టాప్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత "ఖైదీ నెం.150" ఉంది. "జై ల‌వ‌కుశ" కూడా అప్ప‌ట్లో 30 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇప్పుడు అవ‌న్నీ దాటేసి రెండో స్థానం వైపు చూస్తున్నాడు "అర‌వింద స‌మేత‌". 40 కోట్లు అంటే కాస్త క‌ష్ట‌మే అనిపిస్తుంది కానీ అసాధ్యం అయితే కాదు.. తొలిరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 4 నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు 6 షోల‌కు కూడా అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం. దాంతో సినిమాకు టాక్ బాగా వ‌చ్చిందంటే రికార్డుల‌న్నీ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేస్తాయి.

ప్రివ్యూ: "అర‌వింద స‌మేత" మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..! aravinda sametha movie preview.. ntr targets day 1 records..
ఎన్టీఆర్ సమేత త్రివిక్రమ్


పైగా ట్రైల‌ర్‌తో పిచ్చెక్కించాడు.. డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్.. డైలాగ్స్ అంటేనే ఎన్టీఆర్. ఆయ‌న స్క్రీన్‌పై అలా గ‌ల‌గ‌ల మాట్లాడ‌దుతుంటే అభిమానులు పండ‌గ చేసుకుంటారు. ఇక అలాంటి హీరోకు ఇప్పుడు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు దొరికితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.

ప్రివ్యూ: "అర‌వింద స‌మేత" మేనియా.. అసలైన టార్గెట్స్ ఇవే..! aravinda sametha movie preview.. ntr targets day 1 records..
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్


అస‌లే డైలాగులు రాయ‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట‌.. వాటిని చెప్ప‌డంలో ఎన్టీఆర్ దిట్ట. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే ర‌చ్చ ర‌చ్చే. ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క విష‌యం ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌చేస్తుంద‌ని.. క‌చ్చితంగా "అర‌వింద స‌మేత" తెలుగులో కొత్త పంథాకు తెర తీస్తుందని ధీమాగా చెబుతున్నాడు త్రివిక్ర‌మ్. హిట్ కావాలంటే ఈ చిత్రం అక్ష‌రాలా 93 కోట్లు వ‌సూలు చేయాలి.
Published by: Praveen Kumar Vadla
First published: October 10, 2018, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading