"అర‌వింద స‌మేత" కలెక్షన్ల మాటేంటి.. ఇంకా ఎంత బాకీ ఉన్నాడు..?

"అరవింద సమేత"కు అతికష్టమైన సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు కాదు.. ఇప్పట్నుంచి వచ్చే వసూళ్లే సినిమా ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. వచ్చే ఒక్కో కోటి లక్ష్యం దిశగా అడుగేస్తుంది. బాకీ తీర్చాలంటే ఇంకా 18 కోట్లు వెనకబడి ఉంది "అరవింద సమేత". మరి అంత వస్తుందా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2018, 5:46 PM IST
అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్
  • Share this:
తొలిరోజు నుంచే రికార్డ్ వ‌సూళ్లు.. క‌లెక్ష‌న్ల ఊచ‌కోత‌.. ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం ముందు క‌నిపించ‌ని రికార్డుల ఆన‌వాళ్లు.. ఇలా సాగుతుంది వారం రోజులుగా "అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ" వ‌సూళ్ల వేట‌. అయితే ఆరు రోజుల త‌ర్వాత ఈ సినిమా 75 కోట్ల మార్క్ అందుకుంది. సౌత్ ఇండియాలో వ‌ర‌స‌గా మూడు సినిమాల‌తో 100 కోట్లు గ్రాస్.. 75 కోట్ల షేర్ అందుకున్న మూడో హీరో ఎన్టీఆర్. ఈయ‌న కంటే ముందు ర‌జినీకాంత్, విజ‌య్ ఉన్నారు.

"అర‌వింద స‌మేత" హిట్టేనా.. ఇంకా ఎంత బాకీ ఉన్నాడు..? aravinda sametha first week ww collections.. aravinda sametha first week ww collections,aravinda sametha,ntr,trivikram,pooja hegde,telugu cinema,jt ntr,jagapathi babu,sunil,nizam,overseas collections,అరవింద సమేత,సేఫ్ జోన్,93 కోట్లు,టార్గెట్,జూనియర్ ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,పూజాహెగ్డే.త్రివిక్రమ్,సునీల్,జగపతిబాబు,తెలుగు సినిమా,ఓవర్సీస్,కలెక్షన్స్,ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సేఫ్ జోన్
అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఎన్టీఆర్

ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు "అర‌వింద స‌మేత" 75 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల‌కు 55.55 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇక్క‌డ సినిమా సేఫ్‌జోన్‌కి రావాలంటే 70 కోట్లు రావాలి. అంటే మ‌రో 15 కోట్లు వెన‌క‌బ‌డి ఉంద‌న్న‌మాట‌. నైజాంలో 15.50 కోట్ల షేర్ తెచ్చింది ఈ చిత్రం. ఇక సీడెడ్‌‌లో వ‌ర‌సగా మూడోసారి 10 కోట్ల షేర్ మార్క్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇలా అన్నిచోట్లా ఇప్ప‌టికి వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌లెక్క‌.. ఇప్ప‌ట్నుంచి ఒక లెక్క.

"అర‌వింద స‌మేత" హిట్టేనా.. ఇంకా ఎంత బాకీ ఉన్నాడు..? aravinda sametha first week ww collections.. aravinda sametha first week ww collections,aravinda sametha,ntr,trivikram,pooja hegde,telugu cinema,jt ntr,jagapathi babu,sunil,nizam,overseas collections,అరవింద సమేత,సేఫ్ జోన్,93 కోట్లు,టార్గెట్,జూనియర్ ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,పూజాహెగ్డే.త్రివిక్రమ్,సునీల్,జగపతిబాబు,తెలుగు సినిమా,ఓవర్సీస్,కలెక్షన్స్,ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సేఫ్ జోన్
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్
ఎందుకంటే సినిమా సేఫ్ కావ‌డానికి ఇంకా 18 కోట్లు రావాలి.. మ‌రో నాలుగు రోజులు హాలీడేస్ ఉన్నాయి. ఈ వారం పోటీగా "హ‌లో గురు ప్రేమ‌కోస‌మే"తో పాటు "పందెంకోడి 2" సినిమాలు కూడా ఉన్నాయి. ఇవ‌న్నీ త‌ట్టుకుని.. నిల‌బ‌డి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర "అర‌వింద స‌మేత" తెచ్చే ఒక్కో కోటి దాని స‌త్తాకు నిద‌ర్శ‌నం. అందుకే ఇప్ప‌ట్నుంచి వ‌చ్చే ప్ర‌తీ రూపాయి కౌంట్ అన్న‌మాట‌. 93 కోట్లు వ‌స్తే ఈ చిత్రం హిట్ లేదంటే యావ‌రేజ్.

"అర‌వింద స‌మేత" హిట్టేనా.. ఇంకా ఎంత బాకీ ఉన్నాడు..? aravinda sametha first week ww collections.. aravinda sametha first week ww collections,aravinda sametha,ntr,trivikram,pooja hegde,telugu cinema,jt ntr,jagapathi babu,sunil,nizam,overseas collections,అరవింద సమేత,సేఫ్ జోన్,93 కోట్లు,టార్గెట్,జూనియర్ ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,పూజాహెగ్డే.త్రివిక్రమ్,సునీల్,జగపతిబాబు,తెలుగు సినిమా,ఓవర్సీస్,కలెక్షన్స్,ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సేఫ్ జోన్
అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్, పూజాహెగ్డే

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తుంటే ఓవ‌ర్సీస్‌లో అయితే ఈ చిత్రం సేఫ్‌జోన్‌కు రావ‌డం క‌ష్టంగానే ఉంది. అక్క‌డ 12 కోట్ల‌కు పైగానే వ‌స్తే సేఫ్.. అంటే 2.6 మిలియ‌న్ వైపు అడుగులు వేయాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 1.9 మిలియ‌న్ వ‌చ్చాయి. ఈ వారం సినిమాలు బాగుంటే క‌న‌క క‌చ్చితంగా ఆ ప్ర‌భావం "అర‌వింద స‌మేత" క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతుంది. మ‌రి చూడాలిక‌.. ఆరంభం అదిరింది.. మ‌రి అంతం కూడా అదే స్థాయిలో ఉంటుందో లేదో..?
First published: October 17, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...