రామ్‌చరణ్‌కు అరవింద్ స్వామి ఫోన్... సైరా టీంలో అవకాశం కోసమేనా ?

తమిళంలో చిరంజీవికి తాను డబ్బింగ్ చెబుతానని అరవింద్ స్వామి స్వయంగా రామ్‌చరణ్‌కు ఫోన్ చేశారట. అంతే కాకుండా స్వచ్ఛమైన తమిళంలో కొన్ని డైలాగులు చెప్పి ... వాయిస్ ఫైల్స్ చిరంజీవికి పంపారని తెలిసింది.

news18-telugu
Updated: September 7, 2019, 8:36 AM IST
రామ్‌చరణ్‌కు అరవింద్ స్వామి ఫోన్... సైరా టీంలో అవకాశం కోసమేనా ?
రామ్ చరణ్, అరవింద్ స్వామి
  • Share this:
తమిళ స్టార్ అరవింద్ స్వామి ‘సైర నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళంలో చిరంజీవి పాత్రకు వినిపించేది అరవింద్ స్వామి గొంతే. కేవలం చిరు కనిపిస్తారంతే. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’లో అరవింద్ స్వామి ప్రతి నాయకుడిగా నటించారు. ఆ సినిమాతో పాటు సైరాకు కూడా సురేందర్ రెడ్డియే దర్శకుడు. దీంతో ఆ డైరెక్టర్‌తో కూడా అరవింద్ స్వామికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో తమిళంలో చిరంజీవికి తాను డబ్బింగ్ చెబుతానని అరవింద్ స్వామి స్వయంగా రామ్‌చరణ్‌కు ఫోన్ చేశారట. అంతే కాకుండా స్వచ్ఛమైన తమిళంలో కొన్ని డైలాగులు చెప్పి ... వాయిస్ ఫైల్స్ చిరంజీవికి పంపారని తెలిసింది.

ఈ విషయమై చిరంజీవితో చరణ్ మాట్లాడటం.. ఆయన ఓకే చెప్పేయడం చకచక జరిగిపోయాయి. తెలుగు తెరపైన చిరంజీవి గొంతు వినిపిస్తుంది చిరంజీవియే కనిపిస్తారు. కానీ తమిళంలో మాత్రం కనిపించేది చిరంజీవి అయితే.. వినిపించేది మాత్రం అరవింద్ స్వామి అన్నమాట. ఇక పోతే ‘సైరా నరసింహారెడ్డి’కు తమిళలంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కన్నడంలో ఓ సీనియర్ హీరో వాయిస్ ఇస్తున్నారని సమాచారం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ‘సైరా నర్సింహారెడ్డి’ విడుదల కానుంది.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading