# మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఏ.ఆర్.రహమాన్

మీటూ ఎఫెక్ట్‌తో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన నటీమణులు తమ జరిగిన చేదు సంఘటనలు, అన్యాయాలపై ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. తాజాగా మీటూ ఉద్యమంపై ఆస్కార్ పురస్కార గ్రహీత ఏ.ఆర్.రహమాన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో  వెల్లడించారు.

news18-telugu
Updated: October 23, 2018, 12:14 PM IST
# మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఏ.ఆర్.రహమాన్
ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ నటుడు నానా పాటేకర్‌పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ఈ మీటూ ఉద్యమం...ఇపుడు అన్ని రంగాలకు విస్తరించింది. మీటూ ఎఫెక్ట్‌తో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన నటీమణులు తమ జరిగిన చేదు సంఘటనలు, అన్యాయాలపై ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. మీటూ ఎఫెక్ట్‌తో ఇప్పటికే బాలీవుడ్‌లో సెట్స్ ‌పై ఉన్న కొన్ని సినిమాలు ఆగిపోయాయి. మరోవైపు మీటూ ఉద్యమం పక్కదారి పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక దక్షిణాది విషయానికొస్తే..గాయని చిన్మయి...వైరిముత్తు పై చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. తాజా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా కన్నడ కథానాయక శృతి హరిహరన్...యాక్షన్ కింగ్ అర్జున్ మీద చేసిన లైంగిక ఆరోపణలు కోలీవుడ్‌లో పెను దుమారమే రేపుతోంది. ఈ విషయమై అర్జున్‌కు చిత్ర పరిశ్రమలో కొంతమంది బాసటగా నిలుస్తున్నారు.

తాజాగా మీటూ ఉద్యమంపై ఆస్కార్ పురస్కార గ్రహీత ఏ.ఆర్.రహమాన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో  వెల్లడించారు.

గత కొన్ని రోజులు మీటూ ఉద్యమాన్ని చూస్తున్నాను. అందులో భాగంగా కొంత మంది పేర్లు విని నేను షాక్‌కు గురయ్యానన్నారు. నేను ఈ ఇండస్ట్రీని క్లీన్ ఇమేజ్‌తో చూడాలనుకున్నాను. వేధింపులకు గురైన మహిళలకు మనం మరింత అండగా నిలబడాలన్నారు.  బాధితులు తమ బాధను వ్యక్త పరిచేందుకు తగిన వాతావారణాన్ని కల్పించాలన్నారు. మనము కొత్త ఇంటర్నెట్ వ్యవస్థను క్రియేటంలో జాగ్రత్త వహించాలని ట్వీట్ చేశారు.
First published: October 23, 2018, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading