#మీటూ ఎఫెక్ట్: ఏ .ఆర్.రహమాన్ కామెంట్స్ వైరముత్తు పైనేనా..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తోంది.ఇక  ఏ.ఆర్. రహమాన్ మీటూ ఉద్యమానికి మద్దతుగా చేసిన ట్వీట్..తమిళ కవి వైరముత్తును ఉద్దేశించి చేసిందనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: October 23, 2018, 5:37 PM IST
#మీటూ ఎఫెక్ట్: ఏ .ఆర్.రహమాన్ కామెంట్స్ వైరముత్తు పైనేనా..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తోంది.ఇక  ఏ.ఆర్. రహమాన్ మీటూ ఉద్యమానికి మద్దతుగా చేసిన ట్వీట్..తమిళ కవి వైరముత్తును ఉద్దేశించి చేసిందనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తోంది. ఎంతో మంది కథానాయిలతో పాటు వివిధ రంగాల్లో ఉన్న మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. మరోవైపు మీటూ ఉద్యమం పక్కదారి పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  తాజాగా ఈ ఉద్యమానికి ఏ.ఆర్.రహమాన్ తన మద్దతు ప్రకటించారు.

గత కొన్ని రోజులు మీటూ ఉద్యమాన్ని చూస్తున్నాను. అందులో భాగంగా కొంత మంది పేర్లు విని నేను షాక్‌కు గురయ్యానన్నారు. నేను ఈ ఇండస్ట్రీని క్లీన్ ఇమేజ్‌తో చూడాలనుకున్నాను. ఇక రహమాన్ చేసిన ట్వీట్‌ను ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అమిర చిన్మయి శ్రీపాద రీ ట్వీట్ చేసారు.
మీటూ ఉద్యమంలో మహిళలకు అండగా మాట్లాడినందుకు ఏ.ఆర్.రహామాన్‌కు  ధన్యవాదాలు తెలుపుతూ బాధతో కన్నీళ్లు పెట్టకుంటున్న ఎమోజీని షేర్ చేశారు.ఇక  ఏ.ఆర్. రహమాన్ మీటూ ఉద్యమానికి మద్దతుగా చేసిన ట్వీట్..తమిళ కవి వైరముత్తును ఉద్దేశించి చేసిందనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి గాయని చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలకు మద్దతుగానే ఏ.ఆర్.రహామాన్ ఈ ట్వీట్ చేసినట్టు స్పష్టమవుతోంది.
First published: October 23, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading