AR Rahman: ఈ ఒక్కసారి నా పిలుపు వినండి.. రెహమాన్ కొత్త పాటకు అరుదైన గౌరవం

రెహమాన్ పాటకు అరుదైన గౌరవం

పాటలతో అద్భుతాలు చేసే ఏ.ఆర్ రెహమాన్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. నేటి పరిస్థితుల్లో ప్రజలందరిలో ధైర్యం నూరిపోసేందుకు సరికొత్త పాటకు ట్యూన్ చేశారు రహెమాన్.. ఆ పాటకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.

 • Share this:
  ఏఆర్ రెహమాన్ మరో ఘనత సాధించారు. ఆయన తాజాగా ట్యూన్ చేసిన పాటకు అరుదౌన గౌరవం దక్కింది. ఇంతకీ ఈ కొత్త పాట ఏంటంటే? ఇప్పటివరకూ చాలా విన్నారు ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ అని భూమి తల్లి పిలుస్తోంది. ‘ఈ జగతి ఆశతో నిండి ఉంది. ఈ నేల నీలిమతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత పడండి అని చెబుతోంది. కరోనా మహమ్మారి రోజులలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్‌ రాసిన ‘మేరి పుకార్‌ సునో’ పాటను రహమాన్‌ కంపోజ్‌ చేశారు. ఆరుగురు గాయనులు గానం చేశారు. ఈ కాలానికి అవసరమైన గీతం ఇది అనే ప్రశంసలు దక్కుతున్నాయి. కరోనా మహమ్మారి వేళ ప్రజలందరూ ధైర్యాన్ని కోల్పోయారు. స్థయిర్యాన్ని జార్చుకున్నారు. వారిని తిరిగి వారిలా చేయాలి. అందుకు అమ్మే పూనుకోవాలి. అలా భూమి తల్లి తన పిల్లలకు ధైర్యం చెప్పడానికి పిలుస్తున్న పిలుపునే ‘మేరి పుకార్‌ సునో’ పాటగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత గుల్జార్‌ రాశారు.

  ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరిలో సంవేదన ఉంది. అయినా పర్వాలేదు. అందరం ఒక్కతాటిపై రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా నిలవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు.. మానవులు ఎన్నో కష్టాలు దాటి వచ్చారు... ఈ కష్టం కూడా దాటేస్తారు.. అందుకు భూమి తల్లే సాక్ష్యం.. అని ఈ పాట చెబుతోంది. భూమాత గొంతును మహిళా సింగర్లు తప్ప ఇంకెవరు వినిపించగలరు. గుల్జార్‌, తాను కలిసి చేసిన ఆలోచన ఈ పాట అన్నారు కంపోజ్‌ చేసిన ఏ.ఆర్‌.రహమాన్‌.

  దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు రెహమాన్ కు ప్రశంసలు, అవార్డులు, అరుదైన గౌరవాలు ఆయనకు కొత్తేమీ కాదు. విదేశాల్లో కూడా ఆయన సంగీతానికి అభిమానులున్నారు. తాజాగా ఆయన ‘మేరీ పుకార్‌ సునో’ పేరుతో ఓ పాటను రూపొందించి మాతృభూమికి అంకితమిచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖ రచయిత గుల్జార్‌తో ఆయనది మూడు దశాబ్దాల మ్యాజికల్‌ జర్నీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో హిట్‌ సాంగ్స్‌ సంగీత ప్రియులను అలరించాయి. తాజాగా వీరి కాంబోలో వచ్చి సంచలనంగా మారింది ‘మేరీ పుకార్‌ సునో’ పాట. ఉత్తరాది, దక్షిణాది గాయనీ గాయకులైన చిత్ర, శ్రేయాఘోషాల్‌, అల్కా యాగ్నిక్‌, సాధన సర్గమ్‌, షాషా తిరుపతి, అర్మన్‌ మాలిక్‌, ఆషిష్‌ కౌర్‌ పాడారు. టీ సిరీస్‌ ద్వారా విడుదలైన ఈ పాటకు కోటిన్నరకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతే కాదు ఈ పాటకు అమెరికాలో మరో అరుదైన గౌరవం దక్కింది. లాస్‌ ఏంజెల్స్‌, న్యూయార్క్‌ సిటీలో యూట్యూబ్‌ సంస్థ ఈ పాటను బిల్‌బోర్డ్స్‌ డిస్‌ప్లే చేశారు. ఈ విషయాన్ని రెహమాన్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

  మేరీ పుకార్‌ సునో పాట లాస్‌ ఏంజెల్స్‌, న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్‌ని టచ్‌ చేసిందని పేర్కొన్నారు. అమెరికాలో బిల్‌బోర్డ్స్‌ మీద ఇండియన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాటను డిస్‌ప్లే చేయడం గొప్ప విషయం. రెహమాన్‌ హాలీవుడ్‌లో కూడా మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. అప్పట్లో రెహమాన్‌ కంపోజ్‌ చేసిన హాలీవుడ్‌ ఆల్బమ్‌ ‘సూపర్‌ హెవీ’విడుదల సమయంలో ఇలా బిల్‌బోర్డ్స్‌ మీద రెహమాన్‌ పాటను డిస్‌ప్లే చేశారు.
  Published by:Nagesh Paina
  First published: