ఆక్వామన్ రిలీజ్‌కి ముందే పైరసీలో వచ్చేస్తుందా?

హాలీవుడ్ సినిమాలంటేనే టెక్నికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఆక్వామన్ సినిమాలోనైతే, టెక్నికల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని థియేటర్లలో రిలీజ్‌కి ముందే చూసేలా, సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసింది. ఇదే పైరసీ మాఫియాకి కలిసొస్తోంది. రిలీజ్‌కి ముందే పైరసీ ప్రింట్ వచ్చేసేలా ఉంది.

news18-telugu
Updated: November 20, 2018, 2:30 PM IST
ఆక్వామన్ రిలీజ్‌కి ముందే పైరసీలో వచ్చేస్తుందా?
ఆక్వామన్ (సోర్స్ - ట్విట్టర్)
  • Share this:
హాలీవుడ్‌లో అవతార్ తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకుంటున్న సూపర్‌హీరో సినిమా ‘ఆక్వామన్‌’. జేసన్‌ మొమోవా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం చేసిన ఈ మూవీని రిలీజ్‌కి ముందే చూసే చాన్స్ ఉంది. అక్వామన్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 21న విడుదలవుతోంది. ఐతే అమెజాన్‌ ప్రైమ్‌లో మెంబర్‌షిప్ ఉన్నవాళ్లు, రిలీజ్‌కి వారం ముందే దీన్ని చూడొచ్చు. అలాగే ఆటం టికెట్స్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఒక్కొక్కరూ పది టికెట్ల వరకూ కొనుక్కునేలా సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసింది. ఆ టికెట్లతో ఇండియాలోని ఏ థియేటర్‌లోనైనా ‘అక్వామన్‌’‌ని చూసే అవకాశం ఉంది. ఇదివరకు కూడా అమెజాన్‌ జుమాంజీ సినిమాకి ఇలాంటి ఆఫర్‌ ఇచ్చింది.

 

ట్రైలర్‌ అదరహో :ఇప్పటికే భారీ అంచనాలున్న అక్వామన్ ట్రైలర్ రిలీజైంది. ఆక్వామన్‌ పుట్టుక, పెద్దవాడయ్యే కొద్దీ అతనిలో కలిగే చిత్రమైన మార్పులు, ఆక్వామన్‌గా అయిపోవడం వెనకున్న కారణాల్ని ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించామన్న దర్శకుడు జేమ్స్‌ వాన్‌, ట్రైలర్‌లో దాన్ని చూపించారు.

ఆక్వామన్‌లో ఓ దృశ్యం
ఆక్వామన్‌లో ఓ దృశ్యం


పైరసీ వస్తుందా?
కొత్త సినిమాకి కొత్త టెక్నాలజీ జోడించి, సరికొత్తగా రిలీజ్ చేస్తున్నా, అమెజాన్ ప్రైమ్‌లో రానుండటంతో, దీనికి పైరసీ కాపీని సృష్టించేందుకు హ్యాకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే, థియేటర్లలో సినిమా రిలీజ్ కాకముందే, పైరసీ కాపీ వచ్చేసినట్లవుతుంది. సినిమా యూనిట్ మాత్రం దీన్ని థియేటర్లలో చూస్తే వచ్చే మజా, పైరసీలో రాదని చెబుతోంది. పైరసీని ఎంకరేజ్ చేయవద్దని కోరుతోంది.
First published: November 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు