• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • APRIL 28 EM JARIGINDI MOVIE DIRECTOR VEERA SWAMY G APPROACHED CYBER CRIME POLICE FOR UPLOADING HIS MOVIE IN YOUTUBE PK

విడుదలైన వారానికే యూ ట్యూబ్‌లో సినిమా.. సైబర్ పోలీసులకు దర్శకుడి ఫిర్యాదు..

విడుదలైన వారానికే యూ ట్యూబ్‌లో సినిమా.. సైబర్ పోలీసులకు దర్శకుడి ఫిర్యాదు..

ఎప్రిల్ 28 ఏం జరిగింది సినిమా (April 28 Em Jarigindi)

ఈ రోజుల్లో పైరసీని అడ్డుకోవడం అంత చిన్న విషయం కాదు. దానికోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఆగడం లేదు. తాజాగా మరోసారి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. విడుదలైన వారం రోజుల్లోనే యూ ట్యూబ్‌..

  • Share this:
ఈ రోజుల్లో పైరసీని అడ్డుకోవడం అంత చిన్న విషయం కాదు. దానికోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఆగడం లేదు. తాజాగా మరోసారి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. విడుదలైన వారం రోజుల్లోనే యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసారు పైరసీ రాయుళ్ళు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు దర్శక నిర్మాతలు. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి. జి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏప్రిల్ 28 ఏం జరిగింది?'. ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వినూత్నమైన కథతో మంచి ట్విస్ట్‌లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ప్రమోషన్ లేక చతికిలపడింది. అయితే సినిమా విడుదలైన వారం రోజుల్లోనే పైరసీ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారని దర్శకుడు వీరాస్వామి. జి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కష్టపడి చేసిన సినిమాను ఇలా పైరసీ చేస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేం అంటున్నాడు ఈయన. తక్షణమే ఈ పని చేసిన వాళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరాడు. దర్శకుడి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. పైరసీ రాయుళ్ళను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్రాన్ని పైరసీ చేసిన వాళ్లను ఖచ్చితంగా శిక్షిస్తామని దర్శకుడికి వాళ్లు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్లే బ్యాక్ దర్శకుడు హరిప్రసాద్ జక్కా స్క్రీన్‌ప్లే అందించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు