Pradeep Machiraju: ఇండస్ట్రీ రంగానికి చెందిన వాళ్లకు ఏదో ఒక విషయంలో వివాదం ఎదురవుతుంది. అవి ఒక్కోసారి కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో పెద్ద చర్చగా మారుతాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలలో, ఎన్నో షోలలో ఇలాంటివి ఎదురవగా తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇప్పటికే చాలాసార్లు పలు రకాలుగా ఎదుర్కొన్న ప్రదీప్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు.
ఇటీవలే ప్రసారమైన ఓ షో లో ప్రదీప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అతనిపై తీవ్రంగా మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యలు చేయగా వాటిని సరిదిద్దుకోవాలని అంతేకాకుండా క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పకుంటే తన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు తెలిపాడు.
ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న ఈ విషయం గురించి యాంకర్ ప్రదీప్ ఏ విధంగా అలా మాట్లాడడని మండిపడ్డారు. రైతుల, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే మరోలా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. ఇదిలా ఉంటే గతంలో కూడా ప్రదీప్ తన షో లలో నోటికొచ్చినట్లు మాట్లాడటంతో కొందరి మనోభావాలు దెబ్బతినడంతో ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొన్నాడు.
అంతేకాకుండా ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఇటువంటి వివాదంలో చిక్కుకున్నాడు. ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తెలంగాణ భాష గురించి, బతుకమ్మ గురించి కించపరిచే విధంగా మాట్లాడటంతో హైపర్ ఆది మాటలను కూడా ఖండించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ రంగారెడ్డి అధ్యక్షులు నవీన్ గౌడ్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదిని క్షమాపణలు చెప్పమని తెలిపారు. దీంతో హైపర్ ఆది క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Ap capital, Ap pariraksha samathi, Super serial championship, Vishakaptnam, Zee mahothsavam