హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata:సర్కారు వారి పాటలో విలన్ రోల్... ఏపీ ఎంపీ నిజజీవితాన్ని తీశారా ?

Sarkaru Vaari Paata:సర్కారు వారి పాటలో విలన్ రోల్... ఏపీ ఎంపీ నిజజీవితాన్ని తీశారా ?

‘సర్కారు వారి పాట’  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు రోల్ తనదన్నారు ఎంపీ రఘురామ. విలన్ రోల్ తనది కాదని అది సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ అన్నారు.

సర్కారు వారి పాట(Sarakaru Vaari Paata) సినిమా చాలా తనకు బాగా నచ్చిందన్నారు  ఎంపీ రఘు రామ కృష్ణం రాజు(MP Raghu Rama Krishnam Raju). సర్కారు వారి పాటలో  సర్కారు వారి ఆట గురించి చెప్పాలని ఇంటర్వ్యూకి ఒప్పుకున్నానన్నారు, అందులో విలన్ క్యారెక్టర్ సీఎం జగన్ మోహన్(CM Jagan Mohan Reddy) రెడ్డిదే అన్నారు ఎంపీ. సర్కారు సొమ్ము తాకట్టు పెట్టి...సర్కారును అడ్డం పెట్టుకొని అప్పులు చేసి.. ఆ అప్పుల డబ్బును మద్యం ఆదాయాన్ని సొంత ఆదాయానికి మళ్లించి.. ప్రజల్నే పూచీకత్తుగా పెట్టి సర్కారు సొమ్ము దోచిన బ్యాంకుల్ని కూడా దోచిన ఓ ముఖ్యమంత్రి కథ.. ఓ ఎంపీ క్యారెక్టర్‌గా పెట్టారు ఈసినిమాలో అన్నారు. ఇది బేసిక్‌ జగన్ మోహన్ రెడ్డి స్టోరీ అన్నారు ఎంపీ రఘురామ. దాన్ని వైసీపీ వాళ్లు ట్రోల్ చేశారన్నారు. ఈ సర్కారు వారి సినిమాలో నిజం విలన్ ఎవరో...? ఎలాగా ప్రజల సొమ్మును తాకట్టు పెట్టి .. ప్రజాధనాన్ని బ్యాంకుల్లో దొంగ అప్పులు చేశారన్నారు.

తాను నిరంతరం పోరాడేది.. ఈ బ్యాంకుల్లో ,కార్పొరేషన్లలో దొంగ అప్పుల గురించే అన్నారు. రేపు మహేష్ బాబు(Mahesh Babu) లాంటి వాడు వచ్చి .. డబ్బులు కట్టరా అని అడుగుతారు. ఇక్కడ మళ్లీ డబ్బులు కట్టేది ప్రజలే అన్నారను ఎంపీ రఘురామ. కొత్త కోణంలో జగన్ దోచుకుంటున్నాడన్నారు. ఇక సర్కరు వారికి నేను ఇవ్వాల్సిన డబ్బులు కంటే.. సర్కారు వారు నాకు ఇవ్వాల్సిన డబ్బులే ఎక్కువన్నారు ఎంపీ రఘురామ. సర్కారు వారిచేతిలో మోసపోయిన నాగబాబు లాంటి వాడి కథ నాది. కాకపోతే ఆ సినిమాలో నాగబాబు  ఆత్మహత్య చేసుకొని చచ్చాడు.,, కానీ నేను ధైర్యంగా పొరాడుతూ.. సర్కారు వారి మీద పోరాడి నా డబ్బులు నాకు ఇవ్వండిరా అని పోరాడుతున్నానన్నారు. మహేష్ బాబు క్యారెక్టర్ నాది... రాజేంద్రనాథ్ క్యారెక్టర్ కన్నా డర్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిది అన్నారు ఎంపీ రఘురామ.   ఇది చెప్పాలనే ఈ ఇంటర్వ్యూకు ఒప్పుకున్నామన్నారు.

కానీ సినిమా కోసం ట్రోల్ చేస్తుంది జనసేన వాళ్లు కాదు. వారిపేరు మీద వైసీపీ వాళ్లే ట్రోల్ చేస్తున్నారన్నారు. సినిమా బావున్నా కూడా.. ఇప్పటికే రెండు సినిమాలు మటాష్ అయిపోయాయి. జగన్ ఐరెన్ లెగ్ కాదు.. ఇప్పుడు ఈ సినిమా కూడా మటాష్ అయిపోయింది అని జసనేనవాళ్లు ట్రోలింగ్ చేశారన్నారు. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు... అమ్మాయిలు కూడా అభిమానులు ఎక్కువమంది ఉంటారన్నారు ఎంపీ. ఆ సినిమా ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ..ఇలా వైసీపీ వాళ్లు.. జనసేన వాళ్లు ట్రోలింగ్ చేశారన్నారు. సినిమా బావుంది చూడాలని తాను కూడా తన సోషల్ మీడియాలో పేజీలో పోస్టు చేశానని రఘురామ అన్నారు.

First published:

Tags: AP Politics, Raghu Rama Krishnam Raju, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు