జనసేన (Janasena) నేత నాగబాబు (Nagababu), ఏపీ మంత్రి ఆర్కే రోజా (Minister Roja) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ ఇద్దరు రాజకీయ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీపై రోజా విమర్శలు చేయగా.. ఆ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఆమెది నోరా.. మున్సిపాలిటీ కుప్ప తొట్టా? అని విరుచుకుపడ్డారు. ఐతే నాగబాబు విమర్శలపై.. తాజాగా అంతే స్థాయిలో స్పందించారు మంత్రి రోజా. విషయం ఉంటేనే మాట్లాడాలని.. లేదంటే నోరు మూసుకోవాలని చురకలంటించారు. ఏపీ గురించి మీకు ఏ మాత్రం జ్ఞానం లేదని విమర్శలు గుప్పించారు.
'' విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా మూసుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.'' అని నాగుబాబును ట్యాగ్ చేస్తూ.. మంత్రి రోజా ట్వీట్ చేశారు.
విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా ???? నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం @NagaBabuOffl నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం!! pic.twitter.com/m1FCwniteM
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2023
గొడవకు కారణమేంటి..?
ఇటీవల మీడియాతో మాట్లాడిన రోజా.. మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురినీ ఆమె టార్గెట్ చేశారు. ఈ అన్నాదమ్ముళ్లను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా అన్నారు. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. ఏ ఒక్కరికీ ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా.
మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. రోజా పర్యాటక మంత్రి అయ్యాక.. పర్యాటక రంగంలో ఏపీ ర్యాంక్ 18వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు నాగబాబు. వైసీపీ వచ్చాక పర్యాట రంగంపై ఆధారపడి ఉన్న ప్రజలు రోడ్డునబడ్డారని అన్నారు. తమపై విమర్శలు మానుకొని.. ముందు ఏపీ పర్యాటక రంగంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. రోజా నోటికి మున్సిపాలిటీ కుప్ప తొట్టికి తేడా లేదని.. అందుకే ఇన్నాళ్లు ఆమె ఏం మాట్లాడినా స్పందిచ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
రోజా @RojaSelvamaniRK నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023
రోజా, నాగబాబు గతంలో ఇద్దరు జబర్దస్త్ కామెడీ షోలో కలిసి పనిచేశారు. జడ్జిలుగా పక్కపక్క సీట్లలోనే కూర్చొని.. నవ్వులను పంచారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ ఇద్దరు.. ఇప్పుడు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడం హాట్ టాపిక్‌గా మాారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Minister Roja, Nagababu, Tollywood