హోమ్ /వార్తలు /సినిమా /

Avatar 2: షాకింగ్.. అవతార్ 2 సినిమా చూస్తూ.. ఏపీలో ఒకరు మృతి..!

Avatar 2: షాకింగ్.. అవతార్ 2 సినిమా చూస్తూ.. ఏపీలో ఒకరు మృతి..!

విజువల్ వండర్‌గా వచ్చిన ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అయితే ఏపీలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో విషాదం చోటుచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అవతార్ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” (Avatar 2)  విడుదల అయ్యింది. డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వచ్చేసింది. ​ 'అవతార్'‌కు సీక్వెల్​గా  వచ్చిన ఈ  మూవీకి 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్' (Avatar: The Way of Water ).​ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తున్నారు. (Twitter/Photo) అయితే ఈ సినిమా టికెట్లు విడుదలకు ముందు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయి. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

అయితే ఈ క్రమంలో అవతార్ 2  సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్‌-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. అయితే అతడ్ని తమ్ముడు రాజు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇలాగే అవతార్‌-1కు కూడా జరిగింది. తైవాన్‌లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్‌లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్‌ ఎగ్జైట్‌ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఏపీలో ఇలా జరగడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

మరోవైపు అవతార్ 2 మూవీ విడుదలైన ఒక్కరోజులోనే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ రాబట్టింది. మొదటిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా వైడ్‌గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

First published:

Tags: AP News, Avatar

ఉత్తమ కథలు