• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AP HIGH COURT ANNOUNCED JUDGEMENT OVER VAKEEL SAAB TICKET PRICE FILED BY GOVERNMENT HOUSE MOTION PK

Vakeel Saab tickets price: ‘వకీల్ సాబ్‌’ టికెట్స్ రేట్స్ పెంపుపై హై కోర్టు కీలక తీర్పు..

Vakeel Saab tickets price: ‘వకీల్ సాబ్‌’ టికెట్స్ రేట్స్ పెంపుపై హై కోర్టు కీలక తీర్పు..

వకీల్ సాబ్ హై కోర్టు (Vakeel Saab High court)

Vakeel Saab tickets price: సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. తమకు మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్ పెంచుకునే వెసలుబాటు కల్పించాలని వాళ్లు కోర్టును కోరారు. దానికి వాళ్లకు కోర్టు నుంచి కూడా సానుకూలంగా తీర్పు వచ్చింది.

  • Last Updated:
  • Share this:
వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాపై వైసీపీ నాయకులు కూడా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా టికెట్స్ రేట్స్ పెంపుపై రచ్చ జరుగుతుంది. సామాన్యుల కడుపులు కొట్టేలా టికెట్ రేట్స్ పెంచాల్సిన అవసరం ఏంటి అంటూ మంత్రి పేర్ని నాని లాంటి వాళ్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. 'మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు' అంటూ ఎద్దేవా చేసారు కూడా. ఇదిలా ఉంటే సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. తమకు మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్ పెంచుకునే వెసలుబాటు కల్పించాలని వాళ్లు కోర్టును కోరారు. దానికి వాళ్లకు కోర్టు నుంచి కూడా సానుకూలంగా తీర్పు వచ్చింది. మొదటి మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు.

దీంతో పవన్ అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకున్నారు. అయితే దీనిపై హై కోర్టు డివిజన్ బెంచీ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పుడు హై కోర్టు డివిజన్ బెంచీ కీలక తీర్పును వెలువరిచింది.

vakeel saab,vakeel saab movie,vakeel saab movie ticket price ap high court,vakeel saab public talk,pawan kalyan vakeel saab,vakeel saab movie public talk,vakeel saab ticket price controversy,vakeel saab tickets issue,vakeel saab movie ticket price,vakeel saab movie ticket price issue,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టికెట్ రేట్స్ హై కోర్టు,టికెట్ రేట్స్ పెంపుపై హై కోర్టు కీలక తీర్పు
‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


ఇందులోనూ డిస్ట్రిబ్యూటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కోర్టు. మొదటి రెండు రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తేల్చి చెప్పింది. అలాగే మూడో రోజు బుక్ అయిన టికెట్స్ కాకుండా థియేటర్స్ దగ్గర ఇచ్చే టికెట్స్ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇవ్వాలని సూచించింది. అప్పట్నుంచి టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం లేదని చెప్పింది హై కోర్టు. ఈ తీర్పుతో పవన్ అభిమానులతో పాటు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పండగ చేసుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు