హోమ్ /వార్తలు /సినిమా /

మోహన్ బాబు ధర్నా వెనక ఉన్న రాజకీయా ఉద్దేశ్యాలు ఇవేనా..

మోహన్ బాబు ధర్నా వెనక ఉన్న రాజకీయా ఉద్దేశ్యాలు ఇవేనా..

సినీ నటుడు మోహన్ బాబు(ఫైల్ ఫోటో)

సినీ నటుడు మోహన్ బాబు(ఫైల్ ఫోటో)

ఈ ధర్నా వెనక రాజకీయ కారణాలు లేకపోలేదని అందరు చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న మోహన్ బాబు ఈ ధర్నాకు దిగడం వెనక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని పలువురు విశ్లేషకలు పేర్కొంటున్నారు.

    సినిమా రంగంలో మోహన్ బాబు రూటే సెపరేటు.సినిమాల్లో ముందుగా హీరోగా ప్రవేశించినా..ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆపై హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్న నటుడు మోహన్ బాబు. సినిమాల్లో దాసరి శిష్యుడిగా అడుగుపెట్టి..ఆ తర్వాత అన్న సీనియర్ ఎన్టీఆర్ అండదండలతో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆపై టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు. రాజ్యసభ సభ్యత్యం ముగిసిన తర్వాత మోహన్ బాబుకు చంద్రబాబుకు దూరం పెరిగింది. తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉన్న చంద్రబాబుపై పెద్దగా ఫైర్ అయింది లేదు. ఇక వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ..రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైయస్ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి దగ్గరైంది.


    ప్రస్తుతం మోహన్ బాబు ఏ పార్టీలో లేకపోయినా.. తెలుగు దేశం అధినేతతో గత కొంత కాలంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. అదే సమయంలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో ఆయన ధర్నాకు దిగారు. ఈ ధర్నా వెనక రాజకీయ కారణాలు లేకపోలేదని అందరు చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న మోహన్ బాబు ఈ ధర్నాకు దిగడం వెనక జగన్మోహన్ రెడ్డికి వైసీపీ హస్తం ఉందని తెలుగు దేశం వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు వైసీపీకి చెందిన నటుడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పోసానితోనే బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయించడం వెనక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ తతంగం అంతా చూస్తుంటే సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబును ఇరుకున పెట్టేందకు జగన్ ఆడుతున్న డ్రామాలని తెలుగు దేశం వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఈ వ్యవహరం ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

    First published:

    Tags: AP Politics, Chandrababu naidu, Manchu Family, Manchu Manoj, Manchu Vishnu, Mohan Babu, Political, Tdp, Telugu Cinema, Tollywood, Ys jagan, Ysrcp

    ఉత్తమ కథలు