టీడీపీకి షాక్ ఇచ్చిన ఈసీ.. ‘యాత్ర’ సినిమా ప్రీమియర్స్ ఆపలేం..

ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రచ్చ పెరుగుతుంది. ఎవరికి వాళ్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 10:39 PM IST
టీడీపీకి షాక్ ఇచ్చిన ఈసీ.. ‘యాత్ర’ సినిమా ప్రీమియర్స్ ఆపలేం..
యాత్ర కలెక్షన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 10:39 PM IST
ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రచ్చ పెరుగుతుంది. ఎవరికి వాళ్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందిప్పుడు. ఇలాంటి తరుణంలో వాళ్ల మధ్య సినిమాల వార్ కూడా జరుగుతుంది. ఈ పార్టీ వాళ్లు వాళ్ల సినిమాలు విడుదల చేయొద్దని.. ఆ పార్టీ వాళ్లు వీళ్ల సినిమాలు విడుదల చేయొద్దంటూ రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయకూడదంటూ తెలుగుదేశం పట్టుబట్టింది. చివరికి వాళ్ల పట్టే నెగ్గింది కూడా.

AP Elections 2019.. TDP Complaints about Yatra movie special premier to election commission in Star MAA pk.. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రచ్చ పెరుగుతుంది. ఎవరికి వాళ్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందిప్పుడు. ap elections 2019,yatra movie,yatra movie premier show,yatra movie star maa,yatra movie review,yatra movie tdp election commission,ysrcp tdp,ycp tdp war,telugu cinema,యాత్ర సినిమా,యాత్ర సినిమా తెలుగుదేశం,యాత్ర ఎలక్షన్ కమీషన్,యాత్ర తెలుగు దేశం ఫిర్యాదు,
యాత్ర కలెక్షన్స్

ఏపీలో ఇప్పటి వరకు సినిమా విడుదల కాలేదు. కోర్ట్ కూడా తెలుగుదేశంకు సపోర్ట్ చేసింది. ఎన్నికల తర్వాత కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయరాదని తీర్పు ఇచ్చింది. ఇలాంటి సమయంలో యాత్ర సినిమా ప్రీమియర్స్ ఎప్రిల్ 7న ప్లాన్ చేస్తుంది మా యాజమాన్యం. స్టార్ ఛానెల్ ఈ చిత్రాన్ని భారీ రేట్ ఇచ్చి తీసుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన యాత్ర మంచి టాక్ తెచ్చుకుంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించాడు. వైసీపీకి బాగా పనికొచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి. వైఎస్ చేసిన పథకాలన్నీ ఈ చిత్రంలో చూపించారు.

AP Elections 2019.. TDP Complaints about Yatra movie special premier to election commission in Star MAA pk.. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రచ్చ పెరుగుతుంది. ఎవరికి వాళ్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందిప్పుడు. ap elections 2019,yatra movie,yatra movie premier show,yatra movie star maa,yatra movie review,yatra movie tdp election commission,ysrcp tdp,ycp tdp war,telugu cinema,యాత్ర సినిమా,యాత్ర సినిమా తెలుగుదేశం,యాత్ర ఎలక్షన్ కమీషన్,యాత్ర తెలుగు దేశం ఫిర్యాదు,
వైఎస్ఆర్ చంద్రబాబునాయుడు
ఇక ఇదే సమయంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయిపోయింది. ఈ సమయంలో యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేస్తే ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావం పడుతుందని ఈసీకి ఫిర్యాదు చేసారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని కోరింది. అయితే దీనిపై ఈసీ మాత్రం చేతులెత్తేసింది. అలాంటి అధికారం తమకు లేదని.. సినిమా టీవీల్లో ప్రసారం చేసుకోవచ్చని చెప్పింది. దాంతో టీడీపీకి యాత్ర రూపంలో అనుకోని షాక్ తగిలింది.
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...