YSRCP: వైసీపీలోని సినీ నటులకు త్వరలో జగన్ బంపరాఫర్..

ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు స్వతహాగా చాలా మంది సినీ నటులు టీడీపీకి జై కొట్టడానికి భయపడ్డారు. ఆ తర్వాత ఎన్టీఆర్..ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ నటులు చాలా మంది ఆయన పార్టీలోకి క్యూ కట్టారు. ఆయన కన్నుమూసిన తర్వాత కూడా టీడీపీకి సినీ గ్లామర్ పెట్టని కోటలా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో చాలా మంది నటులు తెలుగు దేశం పార్టీని కాదని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో చాలా మంది టీడీపీలో చాలా కాలంగా క్రియా శీలకంగా పనిచేసినవారే ఉన్నారు. తాజాగా తన పార్టీలో చేరిన సినీ నటులకు సముచిత గౌరవం ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 14, 2019, 12:36 PM IST
YSRCP: వైసీపీలోని సినీ నటులకు త్వరలో జగన్ బంపరాఫర్..
వైసీపీలోని సినీ నటులకు జగన్ బంపరాఫర్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు స్వతహాగా చాలా మంది సినీ నటులు టీడీపీకి జై కొట్టడానికి భయపడ్డారు. ఆ తర్వాత ఎన్టీఆర్..ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ నటులు చాలా మంది ఆయన పార్టీలోకి క్యూ కట్టారు. ఆయన కన్నుమూసిన తర్వాత కూడా టీడీపీకి సినీ గ్లామర్ పెట్టని కోటలా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో చాలా మంది నటులు తెలుగు దేశం పార్టీని కాదని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో చాలా మంది టీడీపీలో చాలా కాలంగా క్రియా శీలకంగా పనిచేసినవారే ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌‌కు స్వయానా పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అనంగు అనుచరుడుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని కూడా జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నాడు. మరోవైపు చిరంజీవికి సంబందించిన  కన్నబాబు లాంటి కాపు నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన కూడా జగన్ క్యాబినేట్‌లో మంత్రి అయ్యారు కూడా. మరోవైపు సీనియర్ నటుడు నాగార్జున.. ఎప్పటి నుంచో జగన్‌కు క్లోజ్ అన్న సంగతి తెలిసిందే కదా. చిరంజీవి,ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా జగన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తురన్న ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో ఉంది.

Actor Mohan Babu May join YS Jagan Mohan Reddy YSR Congress Party,సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు తమకున్న క్షేత్ర పరిస్థితులను బట్టి  ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. తాజాగా నట ప్రపూర్ణ మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్‌లో కలవడం ప్రాధాన్యా సంతరించుకుంది. Mohan babu,Mohan Babu join ysrcp,mohan babu join ys jagan ycp,Manchu Manoj,Manchu Manoj Mohan Babu Sri vidyanikethan Fees Reimbursement Dharna,Manchu Manoj Open Letter To People,Mohan babu,manchu family,manchu mohan babu,tirupati news,mohan babu house arrest,mohan babu dharna,Andhra Pradesh News,Andhra Pradesh politics,Mohan Babu chandra babu naidu ys jagan mohan reddy politics Manchu Manoj,Mohan babu Chandra babu naidu ntr YS jagan,Tollywood News,Telugu cinema,మోహన్ బాబు,మోహన్ బాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి,వైసీపీలో జాయిన్ కానున్న మోహన్ బాబు,మోహన్ బాబు వైయస్ జగన్ వైయస్ఆర్‌సీపీ,మోహన్ బాబు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,మంచు మనోజ్ మోహన్ బాబు,మోహన్ బాబు ధర్నా,ప్రజలకు మంచు మనోజ్ బహిరంగ లేఖ,శ్రీ విద్యానికేతన్,తిరుపతిలో ఉద్రిక్తత,చంద్రబాబు నాయుడు,టీడీపీ చంద్రబాబు నాయుడు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్,వై.యస్. జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్‌సీపీ పాలిటిక్స్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,పాలిటిక్స్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్
మోహన్ బాబు, వైయస్ జగన్మోహన్ రెడ్డి


ఇక వైౌయస్ఆర్‌సీపీలో రోజా, మోహన్ బాబు, జయసుధ, రాజశేఖర్ దంపతులు, ఆలీ, 30 ఇయర్స్ పృథ్వీ, పోసాని వంటి నటీనటులు ఉన్నారు. రోజా విషయానికొస్తే... ఆ పార్టీ తరుపున రెండో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంతేకాదు జగన్ తొలి క్యాబినేట్‌తో మంత్రిగా బెర్త్ ఖాయమనే మాటలు కూడా వినబడ్డాయి. కానీ ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెట్టారు. రెండున్నర ఏళ్ల తర్వాత జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు చాన్స్ ఇవ్వాలనుకున్నట్టు  సమాచారం. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు, జయసుధకు ఏదైనా సినీ రంగానికి సంబంధించిన కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. ఇంకోవైపు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీకి ఎస్వీబిసీ చానెల్ చైర్మన్ పదవిలో నియమించబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరగుతోంది. ఇంకోవైపు ఆలీకి ఎమ్మెల్సీ పదవితో పాటు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడుతున్నాయి. మొత్తానికి తనను నమ్ముకొని వచ్చిన సినీ ఇండస్ట్రీకి వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నాడు. ఈ రకంగా సినీ ఇండస్ట్రీకి వైసీపీ అనుకూలం సంకేతాలు పంపించనున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీ వల్ల జగన్‌కు అంతగా లాభం లేకపోయినా.. అందరినీ కలుపుకుపోవాలనే సదుద్దేశ్యంతో జగన్ ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 
First published: July 14, 2019, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading