న్యూస్ యాంకర్ స్వప్నకు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్..

ప్రముఖ న్యూస్ యాంకర్ స్పప్నకు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన పదవి కట్టపెట్టబోతున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.

news18-telugu
Updated: October 12, 2019, 5:59 PM IST
న్యూస్ యాంకర్ స్వప్నకు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్..
యాంకర్ స్పప్నకు నామినేటెడ్ పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ?
  • Share this:
ప్రముఖ న్యూస్ యాంకర్ స్పప్నకు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన పదవి కట్టపెట్టబోతున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మొదట్లో దూరదర్శన్ ఆపై  టీవీ9లో యాంకర్‌గా,న్యూస్ ప్రెసెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా  పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్‌లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా.. ఆ ఛానెల్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తుంది స్వప్న. అంతేకాదు సొంతంగా వెబ్‌  చానెల్‌ను రన్ చేస్తూ జగన్ పట్ల ఉడతా భక్తి చాటుకుంటూనే ఉంది. ఇక  స్వప్న  తాను చేసే ఇంటర్వ్యూలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాని ఇరుకున పెడుతూ.. జగన్ కు బాగా పుష్ ఇచ్చే విధంగా ఆమె ఇంటర్వ్యూస్ ఉండేవి.  ఏపీలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో తన వంతు చిన్న పాత్ర పోషించింది.

ap cm ys jagan mohan reddy big offer to sensational news anchor swapna as svbc director,ys jagan,jagan mohan reddy,swapna,anchor swapna,anchor swapna as svbc director,ys jagan mohan reddy anchor swapna,ttd news,ttd director,ttd news,swapna ttd director,ys jagan mohan reddy,cm jagan mohan reddy,cm ys jagan,ap cm ys jagan mohan reddy,cm ys jagan mohan reddy,ys jagan moahan reddy,ys jagan mohan reddy likely to take oath,ys jagan mohan reddy exclusive interview,ys jagan live,ys jagan speech,ycp chief jagan mohan reddy,ys jagan speech live,jagan mohan reddy to meet kcr,jaganmohan reddy,ys jaganmohan reddy,ys jagan mohan reddy appointed anchor swapna as ttd director,tollywood,telugu cinema,tv9,anchor swapna,inews anchor swapna,swapna interview,swapna,telugu news,swapna dutt,swapna inews,actress swapna interview,sakshi anchor swapna,artist swapna,news,latest news,tv actor swapna,swapna sundari,swapna dutt reacts on tv5 anchor comments on lady artists,swapna cleaning job,swapna varma,swapna with varma,swapna videos,swapna artist,swapna dutt speech,swapna actrees hot pics,swapna gallery,యాంకర్ స్వప్న,ఏపీ సీఎం వైయస్ జగన్,వైయస్ జగన్మోహన్ రెడ్డి,యాంకర్ స్వప్నకు టీటీడీ డైరెక్టర్ పోస్ట్,ఏపీ న్యూస్,టీటీడీ,తిరుమల తిరుపతి దేవస్థానం,
న్యూస్ యాంకర్ స్వప్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ (File Photo)


దానిని ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీబీసీకు ఆమెను డైరెక్టర్ గా నియమించినట్టు సమాచారం. ఆల్రెడీ ఎస్వీబీసీ ఛానెల్‌ చైర్మన్‌గా 30 ఇయర్స్ పృథ్వీని నియమించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సాక్షి లో పనిచేసే చాలా మందిని ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నట్టు జగన్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఐనా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను నమ్ముకున్న వాళ్లకు తనకు తోచిన రీతిలో ఏదో ఒక అవకాశం ఇస్తున్నాడు. అదే రీతిలో న్యూస్ ప్రెసెంటర్ స్వప్నకు ఎస్వీబీసీ చానెల్ డైరెక్టర్‌గా నియమించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఎస్వీబీసీ ఛానెల్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారినట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకున్న సంఘటనలు కోకొల్లలని అందరు చెవులు కొరుకుంటున్నారు.
First published: October 12, 2019, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading