YS Jagan - Tollywood: మంచు విష్ణుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గిఫ్ట్.. మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజే..

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

YS Jagan - Tollywood: దసరా పండక్కి ముందు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాతలకు, బయ్యర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చాలా రోజుల తర్వాత అక్కడ థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి (YS Jagan - Tollywood) ఇచ్చింది గవర్నమెంట్.

  • Share this:
దసరా పండక్కి ముందు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాతలకు, బయ్యర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చాలా రోజుల తర్వాత అక్కడ థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. కరోనా కారణంగా ఎన్నో నెలలుగా అక్కడ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ రన్ అవుతున్నాయి. దానికితోడు నైట్ కర్ఫ్యూ కూడా ఉంది. అంటే మూడు షోలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చు అంటూ చాలా రోజుల కిందే అనుమతి ఇచ్చింది. దానికితోడు 4 షోలు కాకుండా 5 షోలకు సైతం అనుమతులు ఇచ్చింది ఇక్కడి ప్రభుత్వం. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

అక్కడ కరోనా కేసులు ఇప్పటికీ రోజుకు కనీసం 500 వరకు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రోజులు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వలేదు.ఇప్పుడు పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుండటంతో థియేటర్స్ వరకు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చారు జగన్ సర్కార్.

NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం అలాగే కొనసాగనుంది. మహా సముద్రం సినిమా నుంచే 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రానుంది. అక్టోబర్ 14 నుంచి ఈ కొత్త రూల్స్ అప్లై అవుతాయని ప్రభుత్వం సూచించింది. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే టికెట్ రేట్స్ విషయంలో మాత్రం ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్ నడుస్తుంది.

Anchor Manjusha : పొట్టి స్కర్టులో పరువాల విందు చేసిన యాంకర్ మంజూష..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సారథ్యం వహించేందుకు తెలుగువాళ్లు లేరా ? అంటూ కొత్త నినాదం తెరపైకి తీసుకొచ్చారు. ఇదే తన ఓటమికి కారణమంటూ మా సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు ప్రకాశ్ రాజ్. అయితే మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్యానల్ లేవనెత్తిన లోకల్ నినాదం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను ఇరుకునపెట్టేందుకు నేతలు ఏదైనా చేస్తుంటారు. అలాంటి వాళ్లు మా ఎన్నికలను ప్రస్తావిస్తూ.. లోకల్ నినాదం తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఈ నివాదం ఆయా రాష్ట్రాల్లో మళ్లీ పని చేసే అవకాశం ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది. అయితే స్థానికంగా పోటీ చేసే నేతలు.. తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి మా ఎన్నికల్లో తెరపైకి వచ్చిన లోకల్ నినాదం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Praveen Kumar Vadla
First published: