AP CM YS Jagan - Tollywood: సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక రాయితీలు ప్రకటించిన ఏపీ సిఎం జగన్..

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

AP CM YS Jagan - Tollywood: కరోనా కారణంగా కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు ప్రపంచ సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. మన పైనున్న బాలీవుడ్ 4000 కోట్లు నష్టపోయిందని అంచనా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటించింది జగన్ ప్రభుత్వం.

  • Share this:
అసలే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కరోనాతో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ మధ్య కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా కూడా ఇప్పుడు మళ్లీ పెరుగుతున్న కేసులు అందర్నీ కంగారు పెడుతున్నాయి. దాంతో ఎక్కడ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందో.. లేదంటే ఎక్కడ మళ్లీ థియేటర్స్‌లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ చేస్తారో అని కంగారు పడుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే విడుదల తేదీలు కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలు కూడా మళ్లీ ఆలోచనలో పడున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర పరిశ్రమకు చల్లటి వార్త చెప్పాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిత్ర పరిశ్రమకు కొన్ని రాయితీలు ప్రకటించారు ఈయన. సినిమా ఇండస్ట్రీతో పాటు అనుబంధ సంస్థలకు వరాలు కురిపించారు. కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆయా రంగాలకు ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటించారు. 2020 ఎప్రిల్, మే, జూన్ నెలల్లో థియేటర్స్‌, మల్టీప్లెక్సులు చెల్లించాల్సిన స్థిర చార్జీల బకాయిలను 2021 జులై నుంచి డిసెంబర్ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే బ్యాంక్ రుణానికి కూడా 50 శాతం వరకు వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు రోజురోజుకీ వేగంగా పెరుగుతున్నాయి. 2 వేలకు చేరువలో కేసులు వస్తున్నాయి. దాంతో అక్కడ పాక్షికంగా లాక్‌డౌన్ లేదంటే థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: