హోమ్ /వార్తలు /సినిమా /

Manasanamaha : మనసానమ: దర్శకుడిపై ఏపీ సీఎం జగన్ ప్రశంసలు.. !

Manasanamaha : మనసానమ: దర్శకుడిపై ఏపీ సీఎం జగన్ ప్రశంసలు.. !

మనసానమ: దర్శకుడిపై సీఎం జగన్ ప్రశంసలు

మనసానమ: దర్శకుడిపై సీఎం జగన్ ప్రశంసలు

ఈ లఘు చిత్రాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించారు యువ దర్శకుడు దీపక్ రెడ్డి. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకున్న ఈ షార్ట్ ఫిలిం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లింది ఈ లఘు చిత్రం. అంతేకాదు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్‌లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. ఇటీవలే "మనసానమః" జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

  అయితే ఈ లఘు చిత్రాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించారు యువ దర్శకుడు దీపక్ రెడ్డి. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకున్న ఈ షార్ట్ ఫిలిం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దీపక్ రెడ్డిని అభినందించారు. గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలను దీపక్ రెడ్డి రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు దక్కడంపై దీపక్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. "మనసానమః" జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ షార్ట్ ఫిలిం కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు.

  ఇందులో విరాజ్, అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఒక ఫైటర్, అచీవర్‏గా ఎలాంటి మేజర్ సపోర్ట్ లేకుండా దీపక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ప్రపంచంలో ఏ చిత్రానికి రానన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో ప్రదర్శించారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Ap cm jagan, Guinness Book of World Records, Tollywood

  ఉత్తమ కథలు