ఇప్పటికే ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమా టికెట్ల పెంపునకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి. గతంలో జగన్ దగ్గరకు వెళ్లి సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అభ్యర్థించడంతో ఆయా హీరోలు నటించిన సినిమాలకు ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతులు ఇస్తోంది.
మరోవైపు సర్కారు వారి పాట సినిమా కు సంబంధించి ఈ రోజు (మే 7) యూసుఫ్ గూడా పోలీస్ గ్రైండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు టీమ్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈమూవీని మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గీతాగోవిందం సినిమా డైరెక్టర్ పరుశురామ్.. సర్కారు వారి పాటకు దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Film tickets, Mahesh Babu, Sarkaru Vaari Paata