నా గురించి తెలియాలంటే మహానాయకుడు సినిమా చూడండి.. చంద్రబాబు సంచలన కామెంట్స్..

తాజాగా ఈ సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన గురించి తెలుసుకోవాలంటే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా చూడండి అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 3, 2019, 12:03 PM IST
నా గురించి తెలియాలంటే మహానాయకుడు సినిమా చూడండి.. చంద్రబాబు సంచలన కామెంట్స్..
చంద్రబాబు నాయుడు
  • Share this:
‘ఎన్టీఆర్’ సినిమాను బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలసిందే. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. కానీ తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ చూస్తే..ఈ సినిమాను చంద్రబాబు డైరెక్షన్‌లో బాలయ్య కనుసన్నల్లో ఎన్టీఆర్ సినిమాను క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి అర్థమవుతోంది. తాజాగా ఈ సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన గురించి తెలుసుకోవాలంటే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా చూడండి. ఎన్టీఆర్‌ను అప్పట్లో గవర్నర్ రామ్ లాల్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి గద్దె ఎక్కినపుడు నేనె ఎమ్మెల్యేలను రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లి..మళ్లీ ఎన్టీఆర్ రెండోసారి సీఎం సీటులో కూర్చునేలా చేసానని చెప్పుకొచ్చాడు. దీంతో చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ సినిమా తెరకెక్కిన విషయం అర్థమవుతుంది. ఆయన్ని హీరోగా ఫోకస్ చేసి సినిమా చూసినవాళ్లకు మహానాయకుడు అంటే ఎన్టీఆర్ కాకుండా చంద్రబాబు అనేలా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడాని అందరు చెప్పుకుంటున్నారు.

మరోవైపు చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు కౌంటర్ గా మిగతా ప్రతిపక్షాలు ఆయన అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూడాలని వ్యాఖ్యానిస్తున్నారు.

 

First published: March 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు