ఏపీ బీజేపీ నేతతో బాలయ్య ప్రత్యేక అనుబంధం..

టీడీపీ పార్టీ గత ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలైనప్పటికీ రాయలసీమలో ఆ పార్టీ పరువును కాపాడింది మాత్రం నందమూరి బాలకృష్ణ అనే చెప్పవచ్చు. బాలయ్యకు టీడీపీతో పాటు బీజేపీ నేతలతో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది.

news18-telugu
Updated: June 5, 2020, 5:07 PM IST
ఏపీ బీజేపీ నేతతో బాలయ్య ప్రత్యేక అనుబంధం..
బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)
  • Share this:
టీడీపీ పార్టీ గత ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలైనప్పటికీ రాయలసీమలో ఆ పార్టీ పరువును కాపాడింది మాత్రం నందమూరి బాలకృష్ణ అనే చెప్పవచ్చు. హిందూపురం నుంచి వరుసగా రెండో సారి గెలిచిన బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు పయ్యావుల కేశవ్, చంద్రబాబు మాత్రమే రాయలసీమ నుంచి విజయం సాధించారు.  అయినప్పటికీ నియోజకవర్గం పట్ల ఆయన చిన్నచూపు చూస్తారనకుంటే పొరపాటే. గ్యాప్ దొరికినప్పుడల్లా ఎప్పటికప్పుడు హిందూపూర్ లో పర్యటనలు చేపట్టి కార్యకర్తలను ఉత్సాహపరచడం బాలయ్యకు అలవాటే. అయితే తాజాగా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి మారిన అంబికాకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను పార్టీ మారినప్పటికీ ప్రతిరోజు తాను బాలయ్యతో టచ్ లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఆయన ఓకే అంటే ఆయనతో కలిసి సినిమా తీసేందుకు సైతం సిద్ధమని అంబికాకృష్ణ చెప్పుకొచ్చారు.

ap bjp leader ambika krishna told about relation with hindupur mla balakrishna,balakrishna,ambika krishna,balakrishna ambika krishna,bjp leader ambika krishna about balakrishna,balakrishna on modi,nandamuri balakrishna,balakrishna comments on modi,bjp,mla balakrishna,balakrishna on bjp govt,balakrishna warns bjp govt,bjp fires on balakrishna,bjp leaders vs mla balakrishna,bjp leaders about balakrishna speech,bjp leader sridhar about balakrishna,bjp leaders protest at balakrishna house,bjp & ycp leaders fires on tdp mla balakrishna,balakrishna speech,gvl on balakrishna,tollywood,telugu cinema,అంబికా కృష్ణ,బాలకృష్ణ,అంబికా కృష్ణ బాలకృష్ణ,బీజేపీ టీడీపీ బాలకృష్ణ అంబికా కృష్ణ
ఏపీ బీజేపీ నేతతో బాలకృష్ణకు ప్రత్యేక అనుబంధం (File/Photo)


మా ఇద్దరికి దైవభక్తి ఎక్కువగా అని.. అంతేకాదు మా అభిరుచులు కూడా ఒకటే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు బాలయ్యకు కోపం ఉన్న.. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోకటి చెప్పే మనిషి కాదన్నారు. మొత్తంగా ఆయన బోళా మనిషి. ఎవరైనా ఆయనకే తిట్టరు. కల్మషం లేని మంచి మనిషి అందుకే ఆయనతో తన అనుబంధం  కొనసాగుతూనే ఉంది. ఇక తమ వ్యక్తిగత సంబంధానికి రాజకీయ పార్టీలు అడ్డుకాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈయన గతంలో బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. 
Published by: Kiran Kumar Thanjavur
First published: June 5, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading