Home /News /movies /

ANUSKHA FOCUS ON HER LOOK HER PHYSIC FOR NEXT MOVIE MHN

Anuskha Shetty: త‌దుప‌రి సినిమా కోసం అనుష్క క‌ష్టాలు..!

Anuskha focus on her look her physic for next movie

Anuskha focus on her look her physic for next movie

Anuskha Shetty - Next Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కనెక్ట్స్ మూవీని ప్లాప్ దర్శకుడితో చేయబోతున్ననట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి గత ఏడాది పెద్దగా ఏదీ కలిసి రాలేదు. ఓటీటీలో ‘నిశ్శబ్దం’తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించినప్పటికీ నిరాశే మిగిలింది. త‌దుప‌రి సినిమాగా అనుష్క ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తుంద‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపించాయి. అయితే అనుష్క ‘రా రా కృష్ణ‌య్య’ సినిమాను డైరెక్ట్ చేసిన మ‌హేశ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంద‌ని, ప్రాజెక్ట్ దాదాపు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. అయితే ఏం చేసినా అనుష్కకు స‌క్సెస్ కావాలి. ఎందుకంటే హీరోయిన్స్ మ‌ధ్య పోటీ పెరిగిపోయింది.

    మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కాన్సెప్ట్ చిత్రాల్లో న‌టించాలి. ఫిజిల్ విష‌యంలో కేర్ తీసుకోవాలి. అనుష్క కొత్త కాన్సెప్ట్ సినిమాల్లో న‌టిస్తే.. ప్రేక్ష‌కులు చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అందుకు కార‌ణంగా ఆమె లావుగా ఉండ‌ట‌మే. బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల్లో ఎలాగో మెనేజ్ చేసిన అనుష్క‌..కానీ నిశ్శ‌బ్దంలో అనుష్క ఫిజిక్ విమ‌ర్శ‌ల‌కు కార‌ణంగా మారింది. దీంతో నెక్ట్స్ సినిమాకు బ‌రువు త‌గ్గాల‌నే ఆలోచ‌న‌తో అనుష్క స్పెష‌ల్ డైట్‌, ఎక్స‌ర్‌సైజులు స్టార్ట్ చేసింది. అనుష్క యోగా స్పెష‌లిస్ట్ కావ‌డంతో మ‌ళ్లీ పూర్వ‌పు ఫిజిక్ తెచ్చుకుంటుద‌నడంలో సందేహం లేదు. అయితే అనుష్కకి పూర్వ లుక్ కోసం క‌ష్టప‌డుతుంది.

    ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం అనుభ‌వాన్ని సంపాదించుకున్న అనుష్క‌కు ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే అనుష్క ఫిజిక్‌పై మ‌రింత ఫోకస్ పెడితేనె మ‌రిన్ని సినిమాలు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.
    Published by:Anil
    First published:

    Tags: Anushka Shetty, Heroine

    తదుపరి వార్తలు