Home /News /movies /

ANUSHKA TO WORK WITH ANOTHER FLOP DIRECTOR MHN

Anuskha Shetty: మరో ఫ్లాప్ దర్శకుడు సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్నల్.. ఈసారైనా వర్కవుట్ అవుతుందా?

Anushka to work with another flop director

Anushka to work with another flop director

Anuskha Shetty - Flop Director: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు మరో ప్లాప్ దర్శకుడితో సినిమా చేయనుందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కు గ‌త ఏడాది పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. గ‌త ఏడాది ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’ అమెజాన్ ఓటీటీలో విడుద‌లైంది. సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. త‌ర్వాత అనుష్క మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. స‌రి క‌దా... అనుష్క త‌దుప‌రి సినిమా ఇదే అంటూ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా లేదు. అనుష్క త‌ర్వాత చిత్ర‌మిదే నంటూ చాలా వార్త‌లే వినిపించాయి. అయితే సినీ వర్గాల సమాచారం మేరకు అనుష్క ప్లాప్ డైరెక్టర్ సినిమా చేయడానికి ఓకే చెప్పింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

    వివ‌రాల మేర‌కు ఇది వ‌ర‌కు సందీప్ కిష‌న్, రెజీనాల‌తో రా రా కృష్ణయ్య సినిమా చేసిన ద‌ర్శ‌కుడు పి.మ‌హేశ్‌తో అనుష్క సినిమా చేయ‌నుంద‌ట‌. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీనా లేక హీరోయిన్‌గా న‌టిస్తుందా? అని తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం అనుష్క వెయిట్ త‌గ్గే ప‌నిలో ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

    అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. అనుష్క ఎందుకు ప్లాప్ మూవీ డైరెక్ట‌ర్స్‌ను ఎంచుకుంటుందో ఆమె అభిమానుల‌కు అర్థం కాలేదు. ఇది వ‌ర‌కు అనుష్క చేసిన నిశ్శబ్దం సినిమాను డైరెక్ట్ చేసింది హేమంత్ మ‌ధుక‌ర్‌. ఈ ద‌ర్శ‌కుడికి కూడా స‌క్సెస్ లేదు. అయితే కోన‌వెంక‌ట్‌ను న‌మ్మి అనుష్క అప్ప‌ట్లో సినిమాను ఓకే చేసింది. మ‌రి ఈసారి ఎవ‌రినీ చూసి ప్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌డానికి అనుష్క ఎస్ చెప్పిందో అర్థం కావ‌డం లేదు.
    Published by:Anil
    First published:

    Tags: Anushka Shetty, Nishabdam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు