నాగబాబు ఇంట్లో అనుష్క, అనసూయ సందడి.. మ్యాటర్ ఏంటంటే..

బాబు ఇంట్లో అందరరూ కలిసి బుట్ట భోజనం చేశారు. నాగబాబు కొసరి కొసరి వడ్డించగా.. కడుపు నిండా తిని.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

బాబు ఇంట్లో అందరరూ కలిసి బుట్ట భోజనం చేశారు. నాగబాబు కొసరి కొసరి వడ్డించగా.. కడుపు నిండా తిని.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

  • Share this:
    టాలీవుడ్ స్వీటీ అనుష్క మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. మెగా డాటర్ నిహారికతో కలిసి సందడి చేశారు. అంతేకాదు యాంకర్ ప్రదీప్, రవి, భాను, డాన్స్ మాస్టర్స్ జానీ, రఘు, బిత్తిరి సత్తి, అనసూయ కూడా నాగబాబు ఇంట్లో రచ్చ చేశారు. డాన్స్‌లు, స్కిట్స్ చేసి అలరించారు. అనంతరం బాబు ఇంట్లో అందరూ కలిసి బుట్ట భోజనం చేశారు. నాగబాబు కొసరి కొసరి వడ్డించగా.. కడుపు నిండా తిని.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఐతే ఇదంతా ఓ షో కోసం చేశారు. సాధారణంగా పండగల వేళ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తుంటాయి. ఈటీవీలో జబర్దస్త్, పటాస్, ఢీ స్టార్లతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అలాగే జీ తెలుగు సైతం ఉగాది సందర్భంగా బాబు గారింట్లో బుట్ట భోజనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

    దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదలయింది. ఈ కార్యక్రమానికి అనుష్క ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో కడుపుబ్బా నవ్వించే స్కిట్స్, శభాష్ అనిపించే డాన్స్‌లు చేశారు సెలబ్రిటీలు. ఇక అనసూయ.. మహానటి పాత్రలో మెరిసి నటనతో ఆకట్టుకున్నారు. అదిరింది టీమ్‌మేట్స్ కామెడీ స్కిట్స్ ఇందులో హైలైట్‌గా నిలవనున్నాయి. ఆదివారం ఉదయం జీతెలుగులో బాబు గారింట్లో బుట్ట భోజనం కార్యక్రమం ప్రసారం కానుంది. అంటే ఉగాదికి మూడు రోజుల ముందే బుల్లితెరపై తెలుగు సంవత్సరాదిని సెలబ్రేట్ చేసుకుంటోంది జీ తెలుగు ఫ్యామిలీ.
    Published by:Shiva Kumar Addula
    First published: