11 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ కానున్న అనుష్క శెట్టి ‘అరుంధతి’ మూవీ.. హీరోయిన్ ఎవరంటే..

‘సూపర్’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అనుష్క శెట్టి.. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరుంధతి’ మూవీతో ఓవర్ నైౌట్ స్టార్‌డమ్ సంపాదించుకుంది. 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది.

news18-telugu
Updated: July 22, 2020, 4:47 PM IST
11 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ కానున్న అనుష్క శెట్టి ‘అరుంధతి’ మూవీ.. హీరోయిన్ ఎవరంటే..
బాలీవుడ్‌లో రీమేక్ కానున్న అరుంధతి మూవీ (file/photo)
  • Share this:
‘సూపర్’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అనుష్క శెట్టి.. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరుంధతి’ మూవీతో ఓవర్ నైౌట్ స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అనుష్క నటన అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ దాదాపు రూ. 40 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమాలో బొమ్మాళీ అంటూ సోనూసూద్ నటనకు కూడా ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా విడుదలైన 11 యేళ్ల తర్వాత  ఈ  సినిమాను బాలీవుడ్‌లో రీమేక్  చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. గతంలో కూడా ‘అరుంధతి’ సినిమాను కరీనా కపూర్ హీరోయిన్‌గా రీమేక్ చేయాలనకున్నా.. ఎందుకో వర్కౌట్ కాలేదు. తాజాగా ఈ సినిమా హిందీ హక్కులను అల్లు అరవింద్ భారీ రేటుకు కొనుగోలు చేసాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో మధు మంతెనతో కలిసి రీమేక్  చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

అరుంధతి హిందీ రీమేక్‌లో అనుష్క పాత్రలో దీపికా పదుకొణే (File/Photo)


హిందీలో ‘అరుంధతి’ సినిమాను దీపికా పదుకొణేతో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాను హిందీలో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. తెలుగు దర్శకుడు డైరెక్ట్ చేస్తారా. లేకపోతే.. హిందీ దర్శకుడు ఎవరైనా ఈ సినిమాను రీమేక్‌ను దర్శకత్వం వహిస్తారా అనేది చూడాలి. ఇక అరుంధతి విషయానికొస్తే.. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా టీవీల్లో మంచి టీఆర్పీలే వచ్చాయి. మరి డబ్బింగ్ వెర్షన్‌తో హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 22, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading