Home /News /movies /

ANUSHKA SHETTY WILL GOING TO MARRY RAGHAVEDRA RAO SON KS PRAKASH VERY SOON AND NEWS GOES VIRAL PK

అనుష్క శెట్టి పెళ్లి రాఘవేంద్రరావు కొడుకుతో.. నిజమెంత..?

కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)

కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)

Anushka Shetty Marriage: మొన్నటి నవంబర్ 7తో 38 వసంతాలు పూర్తి చేసుకుని.. 40కి చేరవవుతుంది అనుష్క. రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది.

టాలీవుడ్‌లో కొన్ని వార్తలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఇప్పుడు కూడా అనుష్క పెళ్లి గురించి మరో వార్త బయటికి వచ్చింది. అయినా ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చదివి తనకు కూడా బోర్ వచ్చేస్తుందని చెప్పింది అనుష్క. ఈ మధ్యే హిట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తను ఎవరితో ప్రేమలో లేనని చెప్పింది. కానీ పెళ్లెప్పుడు అంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. మరోవైపు అనుష్క పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. మొన్నటి నవంబర్ 7తో 38 వసంతాలు పూర్తి చేసుకుని.. 40కి చేరవవుతుంది అనుష్క.
కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)
కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)

రోజు రోజుకి రూమ‌ర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇంత‌కీ ఈ భామ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. పైగా ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుంద‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క నో అనే స‌మాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగ‌డం లేదు. ఇక ఇప్పుడు వీట‌న్నింటికీ స‌మాధానాలు వ‌స్తున్నాయి. కాక‌పోతే కాస్త మెల్ల‌గా వ‌స్తున్నాయంతే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్లే అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జేజ‌మ్మ మ‌న‌సు అంతా సినిమాల‌పైనే ఉంది. ప్రస్తుతం కోన వెంక‌ట్ నిర్మాణంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తుంది ఈ భామ‌.
కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)
కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)

ఇందులో రంగ‌స్థ‌లంలో రామ్ చ‌రణ్ చేసిన‌ట్లు ఛాలెంజింగ్ పాత్ర ఇది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఎప్రిల్ 2న విడుదల కానుంది. ఇది పూర్త‌య్యే వ‌ర‌కు పెళ్లి ఊసే ఎత్తేలా క‌నిపించ‌డం లేదు జేజ‌మ్మ‌. ఇదిలా ఉంటే త‌న పెళ్లి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క‌. మొన్నటికి మొన్న టీమిండియన్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం జరిగింది. నార్త్ ఆటగాడితో అనుష్క ఏడడుగులు నడవబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది అనుష్క.
కే రాఘవేంద్రరావు తనయుడితో అనుష్క పెళ్లి..? (anushka ks prakash marriage)
కేయస్ ప్రకాశ్ కనిక థిల్లన్

అంతలోనే మరో వార్త కూడా బయటికి వచ్చింది. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాశ్‌ను అనుష్క పెళ్లాడబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరూ సైజ్ జీరో సినిమాకు పనిచేసారు. ఇదిలా ఉంటే ప్రకాశ్‌కు ఇదివరకే కనిక థిల్లాన్ అనే బాలీవుడ్ రైటర్‌తో పెళ్లి విడాకులు అయ్యాయి. అతన్ని అనుష్క రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అనుష్క వైపు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలాంటిదేం లేదని.. తను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెబుతుంది అనుష్క. కానీ నిప్పు లేనిదే పొగ రాదుకదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈమె ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. మరి ఈ వార్తపై క్లారిటీ ఎవరిస్తారో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anushka Shetty, K. Raghavendra Rao, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు