‘అరుంధతి’గా అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఇంతకీ ఎవరంటే..

అవును ఇది నిజం..హీరోయిన్‌గా అనుష్క శెట్టికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘అరుంధతి’ సినిమాకే అగ్రస్థానం ఉంది. అరుంధతిగా అనుష్క రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసింది. ముందుగా ఈ పాత్ర కోసం అనుష్కను అనుకోలేదట.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 7, 2019, 11:14 AM IST
‘అరుంధతి’గా అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఇంతకీ ఎవరంటే..
అరుంధతి మూవీలో అనుష్క శెట్టి
  • Share this:
అవును ఇది నిజం..హీరోయిన్‌గా అనుష్క శెట్టికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘అరుంధతి’ సినిమాకే అగ్రస్థానం ఉంటుంది. అరుంధతిగా అనుష్క రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క వైవిధ్య నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో క్షుద్ర శక్తులను వశం చేసుకున్న అఘోర పశుపతిగా సోనూసూద్ ఈ సినిమాలో అదరగొట్టారు. ఐతే ఈ సినిమాలో ‘అరుంధతి’ పాత్ర కోసం ముందుగా అనుకున్నది అనుష్క  కాదట. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు దివంగత కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకుడు కోడిరామకృష్ణతో పాటు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీని అనుకున్నారు. ఆమె అమెరికాలో ఉండటంతో డేట్స్ కుదరక ఈ పాత్ర ఆమె చేయలేకపోయారు. ఆ తర్వాత అరుంధతి పాత్ర కోసం మమత మోహన్ దాస్‌ను అనుకున్నారు. కానీ క్యాన్సర్ కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పింది. ఆ తర్వాతే ఈ పాత్ర అనుష్క దగ్గరకు వచ్చిందట. అది కూడా అంత ఈజీగా రాలేదని సమాచారం.

Anushka Shetty was not the first choice for lead actress Arundhathi movie..here are the details,arundhati full movie,anushka shetty,anushka shetty,anushka,anushka shetty family,actress anushka shetty,anushka shetty lifestyle,anushka shetty interview,anushka shetty biography,anushka shetty (award winner),anushka shetty hot,hot anushka shetty,anushka shetty movies,anushka movies,anushka shetty family photos,anushka marriage,anushka shetty age,anushka shetty diet,anushka shetty kiss,cute anushka shetty,anushka shetty instagram,anushka shetty twitter,anushka shetty songs,anushka shetty house,arundhati telugu movie,anushka shetty not first choice for arundhati movie,anushka not first choice for arundhati movie,arundhati movie songs,arundhati movie,anushka shetty songs,arundhati tamil movie,exclusive arundhati hd movie,arundhati hd movie,anushka sonu sood arundhati hd movie,anushka shetty hindi movies,anushka shetty movies,anushka shetty telugu movies,anushka movie,anushka hot movies,anushka songs,anushka shetty movies in hindi dubbed,anushka movies,jabardasth comedy show,anushka shetty jabardasth comedy show,అరుంధతి మూవీ,అనుష్క శెట్టి,అనుష్క,అనుష్క శెట్టి ట్విట్టర్,అరుంధతిగా అనుష్క ఫస్ట్ చాయిస్ కాదట,అరుంధతి అనుష్క,అనుష్క శెట్టి అరుంధతి మూవీ,
అరుంధతి మూవీ


అనుష్క పై ముందుగా దర్శక నిర్మాతలు జేజెమ్మకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయడానికి కేరళ నుంచి కొంత మంది డిజైనర్లను నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి రప్పించి అనుష్క పై డమ్మీ షూట్ చేసారు. ఆ తర్వాత సెట్‌లో అదే నగలతో మరోసారి అనుష్కపై ట్రయల్ షూట్ నిర్వహించారు. ఆ తర్వాతనే అనుష్కను అరుంధతి పాత్ర కోసం తీసుకున్నారు. ఇక వెండితెరపై జేజెమ్మ అరుంధతిగా అనుష్క విశ్వరూపం గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రెండేళ్లకు మంచు లక్ష్మీ..‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాలో ఐరేంద్రిగా తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే కదా.
First published: November 7, 2019, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading