హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోని తనువు చాలించడం దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆయన మృతికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలే కారణం అంటున్నారు కంగనా సహా చాలా మంది సెలబ్రిటీలు. సుశాంత్ సింగ్ మృతిపై తెలుగు హీరోలు కూడా స్పందించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సుశాంత్ ఆత్మహత్యపై ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి తనదైన శైలిలో స్పందించింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ఎపుడు మనం సంతోషాలతో పాటు బాధలు కూడా తమ సన్నిహితులతో పంచుకోవాలన్నారు. అంతేకాదు ఇతరులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరించాలని అందులో మంచి ఉంటే గ్రహించాలని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగా అనుష్క శెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాతో సహా ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరిలో ఏవో కొన్ని లోపాలుంటాయి. అంత మాత్రానా జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయం సరైనంది కాదన్నారు.
మనమెవరం ఏది కావాలనుకొని రోడ్డు మ్యాప్‌తో పుట్టలేదు. మనకు ఏది సరైంది అనిపిస్తుందో ఆ దారిలోనే వెళ్లాలన్నారు. మానసిక బాధలకు ఎవరు అతీతులు కాదు. కొందరు సాయం కోసం తమ గోడును వెళ్లబోసుకుంటారు. మరికొందరు లో లోపల మథనపడుతుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొందరు సరైన మార్గాన్ని ఎంచుకోవడమే మనముందున్న సరైన మార్గం అన్నారు. మనమందరం ఉత్తమంగా జీవించడానికే ప్రయత్నిద్దాం అన్నారు.
మనందరం దయతో జీవిద్దాం. ఇతరుల మాటలను వినడానికి ప్రయత్నించాలి. అలాగే ఇతరులు చెప్పెది వినాలి. అందులో మంచి ఉంటే గ్రహించాలి. అలాగే మనిషికి తోడుగా నిలిచేది ఓ నవ్వు. మాటల్ని, వినే గుణం, అప్యాయతతో కూడిన స్పర్ష.. ఎదుటివాళ్లలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. మనం ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు. కానీ ఓ చిన్న చొరవ ఎదుటివారిలో ఎంతో మార్పు తీసుకు రావొచ్చనన్నారు. మార్పు అనేది నెమ్మదిగానే మొదలవ్వాలి అంటూ అనుష్క భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేసింది. ప్రస్తుతం అనుష్క హీరోయిన్గా నటించిన ‘నిశ్శబ్ధం’ సినిమా ఎపుడో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Bollywood, Sushanth singh Rajputh, Tollywood