Home /News /movies /

ANUSHKA SHETTY TO SHARE SCREEN SPACE WITH PRABHAS IN MARUTHIS RAJA DELUX SB

Prabhas: మరోసారి ప్రభాస్‌కు జంటగా అనుష్క... మారుతి డైరెక్షన్‌లో హిట్ కాంబో రిపీట్

ప్రభాస్ అనుష్క

ప్రభాస్ అనుష్క

ప్రభాస్ అనుష్క కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఆ రెండే సినిమాలు హిట్ అయ్యాయి. అయితే మరోసారి జతకట్టేందుకు ఈ జంట సిద్ధమవుతోంది. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ అనుష్క మరోసారి వెండితెరపై మెరిసేందుకు రెడీ అవుతున్నారు.

    ప్రభాస్.. అనుష్క సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. వీరిద్దరు కలిసి నటించిన మిర్చీ, బాహుబలి సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ మారుతితో కలిసి కొత్త సినిమా చేయడానికి ప్రభాస్ సంతకం పెట్టాడు.
    రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఈ హారర్-కామెడీ చిత్రం తెరకెక్కనుంది. 2013లో విడుదలైన ప్రేమ కథా చిత్రమ్‌ సినిమాకు మారుతి నిర్మాతగా పనిచేశారు. అయితే డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేయనున్నాడు. అనుష్కతో పాటు మాళవిక మోహనన్, శ్రీలీల కూడా రాజా డీలక్స్‌లో కనిపించనున్నారు.

    ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. తర్వలోనే డైరెక్టర్ సందీప్ వంగా సినిమాలో జాయిన్ కానున్నాడు రెబల్ స్టార్. అయితే వీటితోపాటు.. డైరెక్టర్ మారుతీ డైరెక్షన్‏లో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మారుతి డైరెక్షన్‌లో ‘రాజా డీలక్స్’ హరర్ కామెడీ సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. అయితే ఈ సినిమా కోసం ముందుగా మెహ్రీన్ పీర్జాదాను అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు ఓకే అవ్వడంతో.. మరి ఆమెకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.

    అయితే మారుతి ఈ సినిమాను రెండు షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు. కేవలం 50 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీం భావిస్తోంది. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నాడు. అయితే మూవీ మేకర్ ఇంకా సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేయలేదు.

    మరోవైపు మారుతి ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. యాక్షన్-కామెడీ, పక్కా కమర్షియల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో పనిచేస్తున్నాడు. గోపీచంద్, రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రం జూలై 1న థియేటర్లలో విడుదల కానుంది. సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, కిరణ్ తలసిల, సప్తగిరి, సాయి కృష్ణ ,రమణా రెడ్డి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. గోపిచంద్,రాశి ఈ చిత్రంలో లాయర్లుగా కనిపించనున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anushka Shetty, Maruthi, Prabhas, Tollywood Cinema

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు