హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: ఆచార్య సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?

Acharya: ఆచార్య సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?

‘ఆచార్య’ మూవీ నుంచి భలే భలే బంజారా సాంగ్ విడుదల (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ నుంచి భలే భలే బంజారా సాంగ్ విడుదల (Twitter/Photo)

కాజల్ ఈ సినిమాలో నటించలేదని.. ఆమె పాత్ర తొలగించనట్లు తెలిసింది, అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.


ప్రస్తుతం ఆచార్య ఫీవర్ నడుస్తోంది.  టాలీవుడ్ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా... ? అని మెగా ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొరాటాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆచార్య హిట్ కొట్టడం ఖాయం అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.


ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పలు పాటలు అభిమానుల్ని ఎంతగానే ఆకట్టుకున్నాయి. అయితే ఆచార్య సినిమా లోని ఒక స్పెషల్ సాంగ్ లో అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా కనిపించబోతుంది. 



అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాజల్ కొంతవరకు షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడం..  ఆమె ఈ సినిమాను పూర్తి చేయలేకపోయింది. మరోవైపు నక్సలిజం బ్రాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి హీరోయిన్, రొమాన్స్ ఉంటే సెట్ కాదని డైరెక్టర్ కొరటాల కూడా భావించారు. దీంతో ఆమె పాత్రను ఈ సినిమా నుండి డిలీట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కొరటాల  ఇటీవలే ఓ ఇంటర్య్వూలో

తెలిపారు.


అయితే మరోవైపు టాలీవుడ్ హీరోయిన్  రేజీనా కాసండ్ర ఆచార్యలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె నటించిన స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్  లభిస్తుంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇప్పుడు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో స్వీటి అనుష్క శెట్టి కూడా నటించినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆచార్య సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన అనుష్క శెట్టి కనిపించబోతున్నట్లు ఒక వార్త నెటింట్లో వైరల్ అవుతుంది.


అయితే అనుష్క శెట్టి 'ఆచార్య' సినిమా లోని ఒక సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ చివర్లో చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తుందని.. ఆమెతో ఓ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దీనిపై సినిమా టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  మరి అనుష్క నిజంగానే ఆచార్య పాటలో కనిపిస్తుందా లేదా? అనేది తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే. 

First published:

Tags: Acharya movie, Anushka Shetty, Chiranjeevi

ఉత్తమ కథలు