అభిమానులకు అనుష్క శెట్టి స్పెషల్ గ్రీటింగ్స్..

సంక్రాంతి సందర్భంగా అనుష్క శెట్టి అభిమానులకు స్పెషల్‌గా గ్రీటింగ్స్ చెప్పింది. అందరిలా శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయకుండా.. వెరైటీగా ఐదు భాషల్లో చెబుతూ అభిమానులు మురిసిపోయేలా చేసింది.

news18-telugu
Updated: January 16, 2020, 1:51 PM IST
అభిమానులకు అనుష్క శెట్టి స్పెషల్ గ్రీటింగ్స్..
అనుష్క శెట్టి (38) Instagram
  • Share this:
సంక్రాంతి సందర్భంగా అనుష్క శెట్టి అభిమానులకు స్పెషల్‌గా గ్రీటింగ్స్ చెప్పింది. అందరిలా శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయకుండా.. వెరైటీగా ఐదు భాషల్లో చెబుతూ అభిమానులు మురిసిపోయేలా చేసింది. అదీ.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో వేసిన సైకత శిల్పానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోలో ఐదు పంతగులపై ఐదు భాషల్లో శుభాకాంక్షలు తెలియజేశాడు సుదర్శన్ పట్నాయక్. ఆ ఫోటోను అనుష్క శెట్టి షేర్ చేసింది.

కాగా, సైలెన్స్ సినిమాలో నటిస్తోన్న స్వీటీ.. ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గింది. మునుపటిలా తన ఫిగర్‌ను మార్చుకొనేందుకు బాగానే కష్టపడింది. ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అనుస్క బధిర యువతి పాత్రలో నటించిందట.


First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>